కొడంగల్, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ అన్నారు. ఆదివారం మండలంలోని హుస్సేన్‌పూర్, ఆలేడ్, పెద్దనందిగామ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం మనందరి బాధ్యత అన్నారు. గ్రామ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి పాటుపడాలని చెప్పారు. హుస్సేన్‌పూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అంజయ్యగౌడ్, ఉపాధ్యక్షులు రవి, మాణిక్యప్ప, ప్రధాన కార్యదర్శి కుర్వ భీరప్ప, కోశాధికారి ఆశప్పలతో పాటు మరి కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఆలేడ్ గ్రామ అధ్యక్షుడిగా జి.నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.రాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ దత్తురెడ్డి, చిట్లపల్లి సర్పంచ్ వెంకట్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ముక్తార్, రుద్రారం మాజీ సర్పంచ్ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిగి మండలంలో..
పరిగి, సెప్టెంబర్ 5 : పరిగి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నికున్నారు. ఈ సందర్భంగా మండలంలోని నారాయణపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా హిదాయత్‌అలీ, రూప్‌ఖాన్‌పేట్ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, నస్కల్ అధ్యక్షుడిగా కాసుల సురేశ్, సుల్తాన్పూర్ అధ్యక్షుడిగా గద్దల ఆనంద్ ఎన్నికయ్యారు.
టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేయాలి
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చిల్ముల్మైలారంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే కీలకమన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జనార్దన్, కార్యదర్శిగా సురేశ్, ఉపాధ్యక్షుడిగా హన్మయ్య, శ్రీనివాస్, కోశాధికారిగా మొగులయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
దౌల్తాబాద్ మండలంలో..
దౌల్తాబాద్, సెప్టెంబర్ 5 : మండలంలోని కుదురుమళ్ల, నందారం, నర్సాపూర్, సంగాయిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కుదురుమళ్ల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోలా మోహన్‌రెడ్డి, నందారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మలకపల్లి బసిరెడ్డి, సంగాయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నర్సపూర్ అధ్యక్షుడిగా సుంకరి అంజిలప్పను ఎన్నుకున్నారు. ఉపాధ్యాక్షులు, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్లా మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు బయిరెడ్డి మోహన్‌రెడ్డి, వెంకటమ్మ పకీరప్ప, మండల కో ఆప్షన్ సభ్యులు జాకీర్‌అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్, చరణ్‌గౌడ్, అశోక్ టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
దోమ మండల పరిధిలో..
దోమ, సెప్టెంబర్ 5 : మండల పరిధిలోని మైలారం గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంతునాయక్, జడ్పీటీసీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను నియమించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాటూరి నర్సింహులను ఎన్నుకోగా, బాస్పల్లి గ్రామంలో భగవంత్‌రెడ్డి, పాలేపల్లి గ్రామంలో అంజయ్యను గ్రామ కమిటీ అధ్యక్షులుగా నియామకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రాఘవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ నవాజ్‌రెడ్డి, తిరుపతయ్య, రాజునాయక్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కులకచర్లలో..
కులకచర్ల, సెప్టెంబర్ 5 : మండల పరిధిలోని రాంనగర్, బొంరెడ్డిపల్లి, సాల్వీడ్, ఎర్రగోవింద్తండాల్లో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను పార్టీ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా కావలి కిష్టయ్య, ఈడిగి మొగులయ్య, లాలు, ఎం.రాములులు ఎన్నిక కాగా, టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శులుగా నాను, చాకలి యాదయ్య, శ్రీనివాసు, గోపాల్‌లు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ కొండయ్య, టీఆర్ఎస్ మండల నాయకులు శేరిరాంరెడ్డి, మొగులయ్య, కృష్ణయ్యగౌడ్, వెంకటయ్యగౌడ్, బొంబాయి రాములునాయక్, బుచ్చయ్య, ఆంజనేయులు, ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాండూరు మండలంలో..
తాండూరు రూరల్, సెప్టెంబర్ 5 : మండలంలోని నారాయణపూర్, గోనూర్, ఖాంజాపూర్, అల్లాపూర్ గ్రామాల్లో నూతనంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాందాస్, పీఏసీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఉమాశంకర్, మహిళా నాయకురాలు శకుంతల, ఎంపీటీసీ సాయిరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాములు, సర్పంచ్‌లు నాగాప్ప, చంద్రప్ప, మాజీ సర్పంచ్ యాదప్ప, పలువురు టీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
పూడూరులో..
పూడూరు, సెప్టెంబర్ 5 : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు నర్సింహారెడ్డి, అనంతరాములు, ప్రవీన్, వినయ్ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతం కోసమే కమిటీలు
మోమిన్‌పేట/ధారూర్/మర్పల్లి: గ్రామాల్లో పార్టీని పటిష్టం చేయడం కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ధారూరు మండల పరిధిలో మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో తరిగోపుల, నాగసాన్పల్లి, మైలారం, నాగారం, కుమ్మరిపల్లి గ్రామాల్లో అలాగే మర్పల్లిలో శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మొగలిగుండ్ల, రాంపూర్ గ్రామాల్లో, మోమిన్ పేట మండలం రాంనాథ్గుడుపల్లి, మల్లారెడ్డిగూడెం, గోవిందాపురం, చంద్రాయన్పల్లి, రావులపల్లి గ్రామాల్లో గ్రామ కమిటీల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.