
ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ
భారీ ర్యాలీలతో సందడిగా మారిన పల్లెలు
రెపరెపలాడిన గులాబీ జెండా
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నేతలు
ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యాలయ భవనం నిర్మాణ పనుల
ప్రారంభోత్సవంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు జిల్లా అంతటా గులాబీ జెండా రెపరెపలాడింది. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవనశంకుస్థాపన సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన.. పట్టణాల్లో భారీ ర్యాలీగా తరలివెళ్లి గులాబీ జెండాలను ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే యాదయ్య, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆమనగల్లులో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీ జెండాను ఎగురవేశారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, తాండూరు పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఢిల్లీలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-వికారాబాద్, సెప్టెంబర్ 2, (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీల్లో టీఆర్ఎస్ భవనానికి శంకుస్థాపన సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఊరూ, వాడా తేడా లేకుండా గులాబీ జెండాను పార్టీ నాయకులు గురువారం ఎగురవేశారు. ఈ వేడుకను పురస్కరించుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంచుకున్నారు. ఆమనగల్లుతోపాటు సాకిబండతండాలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ జెండా ఎగురవేశారు. చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జెండా ఎగురవేశారు. అనంతరం జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి గ్రామంలో, వాడవాడల్లో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం అత్యంత ఉత్సాహంతో డప్పుసప్పుళ్లతో, మిఠాయిలు పంచుకుని కార్యకర్తలు, నాయకులు ఆనందంలో తేలియాడారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపనలో మంత్రి సబితారెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా
టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉప్పొంగిన ఉత్సాహం
తమ తమ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు
పాదయాత్రలు చేసిన ప్రజాప్రతినిధులు
జయశంకర్ సార్ చిత్ర పటాలకు నివాళులర్పించిన నాయకులు
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపనలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు