హఫీజ్ పేట్ :వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతవేగవంతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మంచి స్పందన లభిస్తుంది. పట్టణప్రాథమిక ఆరోగ్యకేంద్రం హఫీజ్ పేట్ పరిధిలోని ఆయాప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మొబైల్ కేంద్రాలలో మందికి వ్యాక్సినేషన్ అందించినట్లు ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ డా. వినయ్ బాబు తెలిపారు.
టీకాలు అందరికీ అందుబాటులో ఉండేలా ఆయాకూడళ్లు, పార్కులేకాకుడా రద్దీగాఉండే ప్రాంతాల్లో సంచారటీకా వాహనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సోమవారం ఆయా మొబైల్ కేంద్రాలలో మాదాపూర్ చందానాయక్ తండా239, మియాపూర్ నడిగడ్డ తండా363, హఫీజ్ పేట్ గంగారం 133, చందానగర్ దీప్తిశ్రీనగర్ 236 మొత్తం 971 మందికి టీకాలు వేసినట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో ఏపీయంఓ రమేష్ నాయక్ , పండరీరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.