వైకుంఠ ఏకాదశి సందర్శంగా వైష్ణవ ఆలయాలు ఉదయం నుంచే కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు అనుమతినిచ్చారు. ఆలయాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాల్లో ప్రముఖులు పూజలు నిర్వహించారు.