
కరోనాపై పోరు కొనసాగుతున్నది. వైరస్‌ను అరికట్టేందుకు అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. పక్క రాష్ర్టాల్లో కొవిడ్, ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ టోల్ ప్లాజా, బల్గెర, నందిన్నె, నారాయణపేట జిల్లాలో 5 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ఉండే డాక్టర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వస్తే వారి వివరాలు నమోదు చేసి వారి సొంతూరులోని వైద్య సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు. మందులు అందించి హోంక్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలు సహకారం అందిస్తే 24 గంటల పాటు పరీక్షలు చేస్తామని ఆరోగ్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వేళ వైరస్ కట్టడికి ఈ చెక్‌పోస్టులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
మహబూబ్‌నగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కేసులు పెరుగుతున్న త రుణంలో సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చే శారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ప్రయాణికుల కు చెక్‌పోస్టుల వద్ద కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకొని మందులు ఇస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తూ వెనక్కి పంపుతున్నారు. జో గుళాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ టోల్‌ప్లా జా, బల్గెర, నందిన్నె, నారాయణపేట జిల్లాలో ఐ దు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు పండుగ సీజన్లో చెక్‌పోస్టులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
చెక్‌పోస్టుల వద్ద పరీక్షలు..
తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉన్న జోగుళాం బ గద్వాల జిల్లా టోల్‌ప్లాజా చెక్‌పోస్టు వద్ద వైద్యాధికారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణలో కి వస్తున్న వాహనాలను నిలిపి ఓ వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే.. వారి సొంత ఊరికి సంబంధించిన వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతోపాటు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. బస్సులు, కార్లు, లారీలు, బైకులు ఇలా అన్ని వా హనాల ప్రయాణికులకు పరీక్షలు చేయాల్సి ఉ న్నా.. పోలీస్ సిబ్బంది లేకపోవడంతో వైద్య సి బ్బంది కేవలం ద్విచక్ర వాహనదారులకు మాత్ర మే పరీక్షలు చేస్తున్నారు. వైద్య సిబ్బంది హైవేపైకి వెళ్లి వాహనాలు నిలిపి టెస్టులు చేసే పరిస్థితి ఉం డదు. అది కేవలం పోలీస్ సిబ్బందితో మాత్రమే సాధ్యమవుతుంది. వైద్య సిబ్బంది అప్పుడప్పుడు ఆటోలు, కార్లను నిలిపి టెస్టులు చేస్తున్నారు. చెక్‌పోస్ట్ వద్దే రెండు మద్యం దుకాణాలు ఉండడం తో మందుబాబుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పోలీసుల భద్రత ఉంటే వైద్యులు ధై ర్యంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. పోలీసులు, రెవెన్యూ సహకారం ఉంటే కొవిడ్ టె స్టుల సంఖ్య మరింతగా పెంచే వీలవుతుంది. ని త్యం వేలాది వాహనాలు టోల్‌ప్లాజా దాటుతు న్నా.. ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు 161 టె స్టులు మాత్రమే చేశారు. ఇందులో ఐదుగురికి పా జిటివ్ వచ్చింది. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్‌కు చాలా మంది వస్తారు. ఏ పీలో ప్రస్తుతం ఉన్న కొవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి పాజిటివ్ వచ్చిన వారినిహోం క్వారంటైన్‌కు తరలించాలి. ఈ తరుణంలో పైద్య సిబ్బందికి పో లీస్, రెవెన్యూ సహకారం అత్యవసరం.
సిబ్బందిపై లారీ డ్రైవర్ల దాడులు..
కర్ణాటక నుంచి తెలంగాణలోకి వచ్చే క్ర మంలో నారాయణపేట జిల్లాలో ఐదు చెక్‌పోస్టులున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి బుధవారం వరకు కాన్‌కుర్తిలో 229, జలాల్పూర్లో 265, ఎక్లాస్‌పూర్‌లో 201, కృష్ణాలో 120, చేగుంటలో 135.. మొత్తం 950 ర్యాపిడ్ టెస్టులు చేశారు. వీటిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వైద్య సిబ్బందికి కనీసం పోలీస్, రెవెన్యూ సిబ్బంది నుంచి ఎలాంటి సహకారం లేదు. దీంతో వైద్య సిబ్బందిపై కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్లు దాడులు చేస్తున్నారు. మహిళా సిబ్బంది రాత్రిపూట విధులు నిర్వర్తించడం చాలా కష్టంగా మారింది. దీంతో చెక్‌పోస్టుల వద్ద డ్యూటీ అంటేనే సిబ్బంది భయపడే పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, చేగుంట, జలాల్పూర్ చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిపై దాడులు జరిగాయి. కొవిడ్ పరీక్షలకు ఒప్పుకోకుండా డ్రైవర్లు దాడులకు పాల్పడుతున్నారని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. కనీసం టెంట్లు కూడా లేవని.. విధులు ఎలా నిర్వర్తించాలని వాపోతున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
కొవిడ్ ఉధృతి పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాకు ఏపీ, కర్ణాటకతో సరిహద్దులున్నాయి. అలంపూర్ టోల్‌ప్లాజా, నందిన్నె, బల్గెర వద్ద వైద్య సిబ్బందితో కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. సంక్రాంతి పం డుగ నేపథ్యంలో హైదరాబాద్-బెంగళూరు మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. పరీక్షలు మరిం త పకడ్బందీగా నిర్వహిస్తాం. చెక్‌పోస్టుల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఇవ్వడంతోపాటు వివరాలు నమోదు చేసుకొని హోం క్వారంటైన్లో ఉండేలా చూస్తాం. దీంతో వైరస్ ప్రబలకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు..
కొవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక సరిహద్దులో ఐదు చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేశాం. ఎక్లాస్పూర్, కాన్కుర్తి, చేగుంట, కృ ష్ణా, జలాల్పూర్ వద్ద ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి మందులు అందచేసి సొం త ఊళ్లకు పంపిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి పూట పరీక్షలు చేసే సిబ్బందిపై కొందరు ప్రయాణికులు దాడులకు దిగడం ఇబ్బందికరంగా ఉన్నది. ఉన్నతాధికారులకు వివరించి పోలీసుల భద్రత కావాలని కోరుతాం. – రాంమనోహర్ రావు, డీఎంహెచ్‌వో, నారాయణపేట
పోలీస్ బందోబస్తు కల్పిస్తాం..
చెక్‌పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది కావాలని వై ద్యాధికారులెవరూ మా దృష్టికి తీసుకురాలేదు. అయితే, అక్కడ స్థానిక పోలీసులు వారికి సహకరిస్తున్నారు. ఒకవేళ వైద్యాధికారులు పోలీసుల స హకారం కావాలని అడిగితే ఇంకా ఫోర్స్ పెంచు తాం. తప్పకుండా పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచి కొవిడ్ పరీక్షలు సవ్యంగా జరిగేందుకు సహకరిస్తాం.