Kalyana lakshmi | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే దానం నాగేందర్

ఖైరతాబాద్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను ఖైరతాబాద్‌లోని బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో కార్పొరేటర్ పి.విజయా రెడ్డి, సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తా కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ వనం సంగీత యాదవ్‌తో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందచేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద కుటుంబంలో ఆడపిల్లల పెండ్లి చేయాలన్నా ఆర్థిక స్థోమత లేనివారు ఎదుర్కొం టున్న ఇబ్బందులను గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను తీసుకువచ్చారన్నారు. సామాన్యుల ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకొని వారి ప్రాంతాల్లో ప్రవేశపెడు తున్నారని, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని, ఆ పథకాలు అర్హులైన కుటుంబాలందరికీ చేరినప్పుడే దానికి సార్ధకత లబిస్తుందని, అది రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఆడపడుచు, ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం సంకల్పమన్నారు.

నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాల కోసం సుమారు రూ.20కోట్లకు పైగానే ఆర్థిక సాయం అందించి నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, త్వరలోనే ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయని, అందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విశేష కృషి చేస్తు న్నారన్నారు. పేదల ఆరోగ్యం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, సోమాజిగూడ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కె అహ్మద్, పి. నాగరాజు, నాయకులు గజ్జెల అజయ్, వనం శ్రీనివాస్ యాదవ్, సలావుద్దీన్, మహేశ్ యాదవ్, కరాటే రమేశ్, శ్రీనివాస్ యాదవ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

