
జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆకట్టుకుంటున్నది. గోడలపై వేసిన చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్ జాతీయరహదారికే అందాలను తీసుకొచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జడ్చర్ల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన నాగిరెడ్డి, శివ, నరేశ్, సాయి, అజయ్, రమేశ్, స్వామి ఆర్ట్స్ ఆర్టిస్టులతో పెయింటింగ్ చేయించారు. సందేశాత్మక చిత్రాలను పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. చిత్రాలను గీసేందుకు
వారం రోజులు పట్టిందని ఆర్టిస్టులు తెలిపారు.