
మెదక్, జనవరి 12 : దేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద సూక్తులు, ఉపన్యాసాలు ప్రపంచ నలుమూలల వ్యాపించాయని చెప్పారు. యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, జిల్లా ఉపాధి అధికారి విజయ్‌కుమార్, అధికారులు,
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు
హవేళీఘనపూర్, జనవరి 12 : యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు అని సామాజిక సమరసత వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ మశ్చేంద్రనాథ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తొగిట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు రవి, మండల అధ్యక్షుడు పరంకుశం, సభ్యులు లక్ష్మీనారాయణ, బలరామ్, చందు, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు శశివర్ధన్, తదితరులు ఉన్నారు. హవేళీఘనపూర్‌లో స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి..
మెదక్ రూరల్, జనవరి 12 : యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచార ప్రముఖ్ బండి వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం మెదక్ మండలం తిమ్మనగర్లో వివేకానందుని జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, సిద్ధిరాములు, కాముని రాజు, కృష్ణ, శ్రీరాములు, గోపాల్, మహేశ్, విఠల్, అశోక్, నవీన్, యువకులు పాల్లొన్నారు.
స్వామి వివేకానందుడికి నివాళి..
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు విజయ్, ఉదయ్‌కిరణ్, కాశీనాథ్, ప్రభాకర్‌రెడ్డి, జనార్దన్, లోకేశ్ పాల్గొన్నారు.