
జడ్చర్ల, జనవరి 12 : స్వామి వివేకానంద అం దరికీ ఆదర్శప్రాయుడని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం స్వామి వివేకానంద జ యంతిని జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహనీయుల అడుగుజాడల్లో నడిచి సమాజ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. పట్టణంలోని రోడ్లను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు 20పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమ్మబావిగడ్డలోని నాగర్‌కర్నూల్ ప్రధానరహదారి నుంచి వాల్మీకినగర్, శాంతినగర్, శ్రీరాంనగర్ మీదుగా వెళ్లే రోడ్డును విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే మున్సిపాలిటీలోని ఎర్రగుట్టకాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకు విన్నవించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కాట్రపల్లి లక్ష్మయ్య, మురళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, చైత న్య, రమేశ్, జ్యోతీకృష్ణారెడ్డి, ఉమాదేవి, సతీశ్, దా మోదర్, శ్రీకాంత్‌రెడ్డి, కొండల్, ఇమ్మూ, శ్రీకాం త్, దోనూరు శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, బీకేఆర్, శంకర్‌నాయక్, దానిశ్, వివేకానంద యువజన సంఘం సభ్యులు జా నకీరాములుగౌడ్, మల్లేశ్, వెంకటేశ్‌గౌడ్, మల్లయ్య, ఉపాధ్యాయ సంఘం నాయకుడు తాహేర్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జనవరి 12 : మండలకేంద్రంతోపాటు ఈద్గాన్‌పల్లిలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రామకృష్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, యాదయ్య, గోవర్ధన్‌రెడ్డి, బాలరాజు, శేఖర్, నర్సింహులు, లింగం, రమేశ్, దేవేందర్, నజీమ్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జనవరి 12 : మండలంలోని చెన్నంగులగడ్డతండాలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి చిత్రపటానికి సర్పంచ్ రవినాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు పాల్గొన్నారు.
సీసీకుంట, దేవరకద్ర మండలాల్లో..
దేవరకద్ర రూరల్, జనవరి 12 : చిన్నచింతకుంట, దేవరకద్ర మండలకేంద్రాలతోపాటు కౌ కుంట్ల, గోపన్‌పల్లి, వెంకటాయపల్లి, పర్ధీపూర్ తదితర గ్రా మాల్లో స్వామి వివేకానంద జయంతిని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హన్వాడలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో కిరణ్, చరణ్, రమేశ్, కేశవులు, సా యి, సుదర్శన్, వెంకటేశ్, అశోక్ పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జనవరి 12 : అడ్డాకుల బస్టాండ్ ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పలు గ్రా మాల్లో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వివేకానంద విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పలు గ్రామాల్లో వివేకాంద జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జనవరి 12 : మండలంలోని పలు గ్రామాల్లో వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజనోత్సవాలు నిర్వహించారు. మండలకేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహానికి యువజన సంఘాల మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, టీఆర్ఎస్ యూత్ మం డల అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు జగన్‌గౌడ్, నారాయణగౌడ్, వెంకట్‌నాయక్, రుస్తుమ్, భరత్, రాజు, గౌస్, నారాయణరెడ్డి, శ్యామ్, అంజి పాల్గొన్నారు.
ఉమ్మడి గండీడ్ మండలంలో..
మహ్మదాబాద్/ గండీడ్, జనవరి 12 : ఉమ్మ డి గండీడ్ మండలంలో స్వామి వివేకానంద జ యంతిని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘ నంగా జరుపుకొన్నారు. వెన్నాచేడ్‌లో మంగలి కృష్ణ జ్ఞాపకార్థం యువత రక్తదాన శిబిరం ఏర్పా టు చేశారు. శిబిరంలో సర్పంచ్ పుల్లారెడ్డితోపాటు 59మంది యువకులు రక్తదానం చేశారు. పెద్దవార్వల్లో సర్పంచ్ లలిత వివేకానంద విగ్రహ ఏ ర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. కప్లాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలను ఏర్పాటు చేశారు.
మొక్కలు నాటిన నాయకులు
జడ్చర్లటౌన్, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్లో పలువురు నాయకులు మొక్కలు నాటారు. అలాగే ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన సేవాసమితి సభ్యులు వేణు, గోనెల రాధాకృష్ణ, రఘు, ప్రవీణ్‌ను సన్మానించారు. కార్యక్రమాల్లో ఉమెన్స్ డెవలప్మెంట్ సొ సైటీ అధ్యక్షురాలు బాలమణి, బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య, వెంకట్రామిరెడ్డి, అమర్నాథ్, జైపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి, మురళి, మధుగౌడ్ పాల్గొన్నారు.
ముగ్గుల పోటీలు
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భం గా డీవైఎస్వో శ్రీనివాస్ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృతినైపుణ్య శిక్షణాకేంద్రం సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశా రు. కార్యక్రమంలో శిక్షణాకేంద్రం ఇన్చార్జి విజయ్‌కుమార్, హరిప్రసాద్, కౌసల్య, విజయలక్ష్మి, వంశీ, ఖలీల్, ఇమ్రాన్, అజహర్ ఉన్నారు. అదేవిధంగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ క్యాడె ట్స్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జీబీఎంకే రావు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, రాజేశ్వరి, రామకృష్ణ, అబ్దుల్‌ఖయ్యూం, రాజశేఖర్‌రెడ్డి, జీవన్‌కుమార్, యో ద్గిల్ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, జనవరి 12 : మున్సిపాలిటీ కేం ద్రంలో వివేకానంద సమాజం ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.