జైనథ్, ఏప్రిల్ 3 : అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని బెల్లూరిగూడలో పలువురు బీజేపీ కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమపథకాలు అమలవుతున్నాయని అన్నారు. వాటిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పా రు. గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదన్నారు. గిరిజన ఆవాసాలకు రవాణా, తాగునీరు, సాగునీరు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రతి గూడెంలో కుమ్రం భీం, హీరాసుక విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. బెల్లూరి గూడలో భీం విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెటి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, సర్పంచ్లు కుమ్ర రూప, ఎంపీటీసీ ఇందు, నాయకులు రాంరెడ్డి, కిషన్, దత్తు, ధర్ము, నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 3: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పెండల్వాడకు చెందిన కాంగ్రెస్నాయకులు చెందిన రాకేశ్, హన్మాండ్లు, అనిల్, దేవిదాస్, రాజు, మంచాల రాజు, విజయ్, దశరథ్, గజానన్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు లింగారెడ్డి,వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 3: పట్టణంలోని బాలాజీ, కేఆర్కే కాలనీల పద్మశాలీ సంఘం కమ్యూనిటీ హాల్, ప్రహారీ, బోర్ ఏర్పాటుకు త్వరలో భూమిపూజ చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హామీ ఇచ్చారు. పట్టణంలని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు పద్మశాలీ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు జిట్ట రమేశ్, గౌరవాధ్యక్షుడు దాసరి రమేశ్, ప్రధాన కార్యదర్శి దాసరి ఆశన్న, నాయకులు గాజంగల రాము, ఆశన్న, మామిడాల దశరథ్, బండ గంగన్న, బండ అవినాశ్, బండ శ్రీనివాస్, బాస మాధవ్, ఎనగంటి రమణయ్య, కట్కం శ్రీనివాస్ పాల్గొన్నారు.