
నిజాంపేట, జనవరి 13 : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశ పెడుతుంటే, కేంద్ర ప్రభుత్వం రైతులను ఆగం చేస్తున్నదని నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. గురువారం నిజాంపేటలోని మం డల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. బీజేపీ ప్రభు త్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా రైతులను మనోవేదనకు గురి చేస్తున్నదన్నారు. మరోవైపు ఎరువుల ధరలు పెంచడం అన్యాయమని, భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంపత్, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, పీఏసీఎస్ డైరెక్టర్లు కిష్టారెడ్డి, స్వామిగౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, టీర్ఎస్ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.
ఎరువుల ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి..
పెద్దశంకరంపేట, జనవరి 13 : ఎరువుల ధరలను పెంచే నిర్ణయాన్ని కేంద్రం ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు డిమాండ్ చేశారు. గురువారం పెద్దశంకరంపేటలో టీఆర్ఎస్ నాయకుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారిని అప్పుల పాలు చేస్తున్నదన్నారు. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తు చేశారు. సమావేశంలో రైతుబంధు మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ అం జయ్య, నాయకులు విఠల్‌గౌడ్, శంకరయ్య, కిషన్, అడివయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన..
చేగుంట, జనవరి 13 : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేగుంటలో టీఆర్ఎస్ నాయకులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, ఎంపీటీసీలు వెంకటలక్ష్మి, బండి కవిత, రైతుబంధు జిల్లా డైరెక్టర్ మోహన్‌రెడ్డి, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, విశ్వేశ్వర్, సత్యనారాయణ పాల్గొన్నారు.