మార్కెట్లో కంప్యూటర్
ఎంబ్రాయిడింగ్ ఆకర్షిస్తున్న మోడళ్లు..
ధరకు వెనుకాడని అతివలు
మహిళలు నచ్చే చీరలు, మెచ్చే బ్లౌజులపై
ఆకర్షణీయమైన డిజైన్ వేసేందుకు మార్కెట్లో కంప్యూటర్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోరుకున్న డిజైన్లను గంటల వ్యవధిలోనే యంత్రం ద్వారా అందించే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో డిజైన్లు అందుబాటులోకి రావడంపై మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పట్టణాల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
కంప్యూటర్ యంత్రం ద్వారా రోజుకు రెండు నుంచి మూడు సాధారణ డిజైన్లు మరో రెండు హెవీ డిజైన్లు తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. మిషన్ పని చేస్తున్న సమయంలో దగ్గరుండి డిజైన్‌ను పరిశీలించాల్సిందే. డిజైన్‌కు అవసరమైన రంగు దారాలను, డిజైన్ వేయడానికి సమయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా సమయాన్ని కేటాయించుకుని, దారపు ఉండలను దగ్గర పెట్టుకొని పని ప్రారంభించాల్సి ఉంటుంది. రోజుకు రెండు నుంచి మూడు బ్లౌజులపై డిజైన్ వేస్తే నెలకు అన్ని ఖర్చులు పోను రూ.20వేల నుంచి 30వరకు ఆదాయం ఉంటుంది. అయితే, ప్రస్తుతం బ్లౌజులపైనే గాకుండా చీరలపైనా మగ్గం డిజైన్లు వేస్తున్నారు. మగ్గంపై రోజుకు ఒక చీరను మాత్రమే వర్క్ చేయగలరు. రాత్రింబవళ్లు కష్టపడితే రెండు చీరలను రెడీ చేయెచ్చు.
మహిళలు చాలా ఆసక్తి చూపుతున్నారు..
కంప్యూటర్ డిజైన్లను మహిళలు చాలా ఇష్టపడుతున్నారు. నూతన టెక్నాలజీతో శ్రమ తప్పడంతో పాటు పని సులువు అవడమే కావడం వల్ల మిషన్ కొనుగోలు చేశాం. కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకుంటే సరిపోతుంది. అనుకున్న సమయానికి డిజైన్ బ్లౌజులు, చీరలను అందిస్తున్నాం.