రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర
కార్పొరేట్ వ్యవస్థలకు లాభం చేకూర్చేందుకే..
విద్యుత్ సవరణ చట్టం ఈ ఇతివృత్తాన్నే రైతన్న
సినిమాగా మలిచిన ఆర్.నారాయణమూర్తి
ఢిల్లీలో జరుగుతున్న రైతన్నల పోరాట
సారాంశమూ ఇదే..
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటలో మంత్రితో ఆర్.నారాయణ మూర్తి భేటీ
25మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు ఉరుముల్లేని పిడుగులు లాంటివని, వాటిల్లో రైతాంగాన్ని కూలీలుగా మార్చే కుట్ర దాగి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తాను తీసిన రైతన్న సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసిన మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆర్.నారాయణ మూర్తి
గురువారం సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. రైతాంగానికి మేలు చేస్తే సమాజమే కాదు మొత్తం దేశమే పురోగతి సాధిస్తుందని, ఇదే ఇతివృత్తాన్ని కండ్లకు కట్టించిన సినిమా రైతన్న అని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చుతుండగా కేంద్రం తెచ్చే చట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బీహార్‌లో కేంద్ర చట్టాలు అమలులో ఉన్నాయని, దాంతో అక్కడ రైతులు కూలీలుగా మారారని ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి ప్రస్తావించారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 19 : పురాతన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న పంచకర్మ ఫిజియో థెరపీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంలో కేరళకు చెందిన శాంతిగిరి ఆశ్రమం భేష్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నాబార్డు సహకారంతో ఈ కోర్సుల్లో శిక్షణ పొందిన వారందరికీ ఉపాధి కల్పించడంపై ఆయన ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ ఏడాది ఆ సంస్థ సౌజన్యంతో, నాబార్డు సహకారంతో శిక్షణ పొందిన 25 మందిలో 13 మంది సూర్యాపేట చెందిన వారు ఉండటం హర్షణీయమన్నారు. కేరళలో శిక్షణ పొందిన 25 మందికి ఉద్యోగావకాశాలు లభించడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన 25 మందికి హైదరాబాద్‌లో గురువారం మంత్రి జగదీశ్‌రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. నాబార్డు డెవలప్మెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, శాంతిగిరి ఆశ్రమం తెలుగు రాష్ర్టాల బాధ్యులు ప్రమోద్‌కుమార్, దిశ ఫౌండేషన్ డెరెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు.
అవి చట్టాలు కాదు.. పిడుగులు
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరుములు లేని పిడుగు లాంటివని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చే కుట్రలో భాగమే ఆ చట్టాల రహస్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి ఇతి వృత్తాన్ని ఆధారం చేసుకొని దర్శక, నిర్మాత నారాయణమూర్తి రైతన్న సినిమాను అద్భుతంగా రూపొందించారని అన్నారు. బుధవారం ఆర్.నారాయణమూర్తి సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులపై అవగాహన కల్పిస్తునే సమాజంలో చైతన్యం కలిగించేందుకు ఆర్.నారాయణమూర్తి రూపొందించిన రైతన్న సినిమా దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గాడిలో పడిన వ్యవసాయం.. కేంద్రం తెస్తున్న చట్టాలతో మళ్లీ నష్టాల పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారబోతున్నాయన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సినిమా చూడడం తనకు గొప్ప బలాన్నిచ్చిందని పేర్కొన్నారు.