e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home జిల్లాలు ఘనంగా సద్దుల బతుకమ్మ

ఘనంగా సద్దుల బతుకమ్మ

మోత్కూరు, అక్టోబర్‌ 14 : సద్దుల బతుకమ్మ సంబురాలను మండలంలో గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు.. సాయంత్రం గ్రామాల్లోని కూడళ్ల వద్దకు చేరారు. అక్కడ బతుకమ్మలను ఉంచి ఆడారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌ చెరువులో నిమజ్జనం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, కౌన్సిలర్లు విజయ, కవిత, మల్లమ్మ, సుజాత, రజిత స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనాజిపురంలో జడ్పీటీసీ గోరుపల్లి శారద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్‌ : పట్టణంలోని రాయగిరిలో సద్దుల బతుకమ్మ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం, రాయగిరి ఎక్స్‌రోడ్డులో బతుకమ్మలను పెట్టి ఉయ్యాల పాటలు పాడుతూ కోలాటం ఆడారు. నృత్యాలు చేశారు.
అడ్డగూడూరు : మండల కేంద్రంతోపాటు ధర్మారం, లక్ష్మీదేవికాల్వ, గట్టుసింగారం, డి.రేపాక, కంచనపల్లి, చౌళ్లరామారం, జానకీపురం, చిన్నపడిశాల, కోటమర్తి, చిర్రగూడూరు తదితర గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు డీజే పాటలతో హుషారుగా నృత్యాలు చేశారు.
బీబీనగర్‌ : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు బతుకమ్మలను ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement