సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9 : సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల ఎన్నికల జోరు కొనసాగుతున్నది. గురువారం జిల్లా కేంద్రంలోని 1 నుంచి 24 వార్డుల్లో కొత్త కార్యవర్గాల ఎన్నికలు జరిగాయి. దాదాపుగా ఏకగ్రీవాలే అయినట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలను గురువారం నిర్వహించారు. హనుమనాయక్తండా గ్రామ శాఖ అధ్యక్షుడిగా ధరావత్ కర్ణాకర్, ఎర్కారం-ఆవుదొడ్డి ప్రవీణ్, రామన్నగూడెం-గౌని లక్ష్మణుడు, రాజానాయక్‌తండా-లునావత్ కిషన్‌సింగ్, జాటోతుతండా గ్రామశాఖ అధ్యక్షుడిగా జాటోతు ధరాసింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ గౌడ్, నాగూనాయక్, యుగంధర్, భరత్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : మండలంలోని గ్రామాల్లో గురువారం టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తతండా గ్రామశాఖ అధ్యక్షుడిగా బానోతు వెంకన్న, నశింపేట-గుండాల రమేశ్, గట్టికల్-మడ్డి శ్రీను, పాతర్లపహాడ్-ఆరెంపుల సైదులు, దాచారం-గుడిపుడి నాగరాజు, దుబ్బతండా గ్రామశాఖ అధ్యక్షుడిగా జాటోతు శ్రీనును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, ఎన్నికల పరిశీలకులు చాంప్లానాయక్, బద్రీనాయక్, ధరావత్ బిల్యానాయక్, రవి, చెట్టు సత్యం, తూడి నర్సింహారావు, గుంషావలీ, బెల్లకొండ యాదగిరి పాల్గొన్నారు.