కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 9 : పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నల్లగొండ శాఖ అందజేసిన వెయ్యి వినాయక విగ్రహాలలో 200 విగ్రహాలను వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టితో చేసిన విగ్రహాల వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు. రంగులతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా నీరు కలుషితమై జలచరాల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి 300, కోదాడకు 200, హుజూర్ నగర్‌కు 120 విగ్రహాలను అందజేసి ఆయా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు పంపిణీ చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, ఏఓ శ్రీదేవి, కాలుష్య నియంత్రణ మండలి సహాయ పర్యావరణ శాస్త్ర వేత్త రవీందర్, పురుషోత్తం రెడ్డి, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గ్రీన్‌క్లబ్ ఆధ్వర్యంలో..
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 9 : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ గ్రీన్‌క్లబ్ గురువారం మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డికి మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్ తోట కిరణ్, కోశాధికారి ఉప్పల శ్రవణ్, ఏఓ వందనపు శ్రీదేవి పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలను పూజించాలి : మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 9 : తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించే గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ పట్టణవాసులను కోరారు. పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజలకు అందజేసి మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, కౌన్సిలర్ ఎస్.కె.తాహేర్‌పాషా, కో-అప్షన్ సభ్యులు వెంపటి సురేశ్, స్వరూపారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఆర్ఓ జ్ఞానేశ్వరి, ఆర్ఐలు గౌసుద్దీన్, శివరాంరెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో… ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ఈగ దయాకర్గుప్తా గురువారం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శివకుమార్, కోశాధికారి పైడిమర్రి కేశవులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, తాళ్లపల్లి రామయ్య, నూకా వెంకటేశం, గోపారపు రాజు, మిర్యాల సుధాకర్, నోముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.