ఆ పార్టీ మండలాధ్యక్షుడు భాస్కర్
కోదాడ రూరల్, సెప్టెంబర్ 8 : టీఆర్ఎస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్, ఎంపీపీ చింతా కవితారెడ్డి అన్నారు. మండలంలోని గణపవరం, తొగర్రాయి, గుడిబండలో నిర్వహించిన టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో మండల ఎన్నికల పరిశీలకులు నంద్యాల రాంరెడ్డి, యాదగిరి, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు జానీమియా, మాజీ జడ్పీటీసీ బట్టు శివాజీ, కూచిపూడి ఎంపీటీసీ కోటేశ్వర్ రావు, సర్పంచులు శ్రీవిజయాకిరణ్, లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, రామారావు, పీఏసీఎస్ డైరెక్టర్లు ప్రభాకర్‌రావు, వేలాద్రి, కొండల్రావు, కుక్కడపు నాగరాజు, హసన్ అలీ, భిక్షం, కత్తి వెంకటేశ్వర్ రావు, పోషం పూర్ణయ్య, గురువయ్య, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
మఠంపల్లి మండలంలో..
మఠంపల్లి : మండలంలోని కృష్ణతండా, బీమ్లాతండా, అల్లీపురం గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కృష్ణతండా అధ్యక్షుడిగా అజ్మీరాశ్రీను, భీమ్లాతండా- సోడాసౌతు దేవా, అల్లీపురం-బోగాల శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్ నాయక్, ఎన్నికల పరిశీలకుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణంరాజు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు నాగిరెడ్డి, పుల్లారెడ్డి, అశోక్, సర్పంచులు రామారావు, రవి పాల్గొన్నారు.
పాలకవీడు మండలంలో..
పాలకవీడు : మండలంలోని జాన్‌పహాడ్, కోమటికుంట, చెర్వుతండాలో బుధవారం టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మలమంటి దుర్గారావు బుధవారం తెలిపారు. జాన్‌పహాడ్ గ్రామశాఖ అధ్యక్షుడిగా నాగెండ్ల సైదయ్య, ప్రధాన కార్యదర్శిగా ఉబ్బపల్లి కిరణ్, ఉపాధ్యక్షుడిగా షేక్ బాలసైదా, కోమటికుంట అధ్యక్షుడిగా మేకల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్మిగా వడిత్యా మగతా నాయక్ , ఉపాధ్యక్షుడిగా రాతికింది చిన లింగయ్య, చెర్వుతండా అధ్యక్షుడిగా బాణావత్ కృష్ణానాయక్, ప్రధాన కార్యదర్శిగా బాణావత్ లక్పతి, ఉపాధ్యక్షుడిగా బాణావత్ కిషన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు, నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ చందమళ్ల జయబాబు, నాగెండ్ల శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాయకులు సైదులు, వెంకట్ రెడ్డి, రాంచందర్ నాయక్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్ల్లు పాల్గొన్నారు.
గరిడేపల్లి మండలంలో…
గరిడేపల్లి : మండలంలోని ఆరు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ నాయకులు, ఎన్నికల పరిశీలకులు తెలిపారు. సర్వారం గ్రామాధ్యక్షుడిగా బారెడ్డి గోవింద్‌రెడ్డి, మంగాపురం-ఎల్లావుల నాగరాజు, కాచవారిగూడెం -దొంతగాని రాంబాబు గౌడ్, లచ్యాతండా -వాంకుడోతు యల్లయ్య, అప్పన్నపేట -రెడబోతు శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్ -పిల్లి అంజయ్య ఎన్నికయ్యారు. ఆయా చోట్ల టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరవిందరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, వినాయకరావు, గిరి, మార్కండేయులు, సైదిరెడ్డి, కృష్ణ, సర్వారం సర్పంచ్ నాగిరెడ్డి, వీరబాబు, గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు.
నడిగూడెం మండలంలో..
నడిగూడెం : మండల కేంద్రంలో బృందావనపురం, గోపాలపురం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకుడు వెంపటి వెంకటేశ్వర్, కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణీపుల్లారెడ్డి, జడ్పీటీసీ కవితానాగరాజు, సర్పంచ్ నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, చంద్రయ్య, నాగన్న, మహేశ్, ఖలీల్ అహ్మద్, ఆంజనేయులు, షేక్ గౌస్, లింగారెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.
నారాయణపురం కమిటీ..
చిలుకూరు : టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నారాయణపురంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సైదయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు జానీమియా, సర్పంచ్ శంకర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్‌బాబు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికే గ్రామ కమిటీలు..
అనంతగిరి : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలను నియమిస్తున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్ తెలిపారు. మండలంలోని వెంకట్రామాపురం, పాతతండా, కొత్తగోల్ తండా, శాంతినగర్‌లో గ్రామకమిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసాద్, సురేశ్. వెంకన్న, చలపతి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
హుజూర్నగర్ మండలంలో..
హుజూర్నగర్ టౌన్ : మండలంలోని లక్కవరం, గోపాలపురం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వీరభద్రరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. లక్కవరం అధ్యక్షుడిగా దుగ్గి నరసింహారావు, ఉపాధ్యక్షుడిగా పొన్నబోయిన వలరాజు, గోపాలపురం అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్, ఉపాధ్యక్షుడిగా బెల్లంకొండ ఉపేందర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్నబీ, ఎంపీటీసీలు ముడెం గోపిరెడ్డి, రాజారావు, నాయకులు కస్తాల రామయ్య పాల్గొన్నారు.
నేరేడుచర్ల మండలంలో..
నేరేడుచర్ల : మండలంలోని కల్లూరులో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామశాఖ అధ్యక్షుడిగా బుడిగె నాగరాజు, ప్రధాన కార్యదర్శి బుడిగె సతీశ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, నాయకులు అరిబండి సురేశ్, పేరబోయిన వీరయ్య, పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీలు నారాయణరెడ్డి, రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సుదర్శన్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు జగతయ్య, సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు.