సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 8 : మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోలిపేట గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉగ్గం మల్లికార్జున్, తాళ్లకాంపాడ్- బెల్లంకొండ సైదులు, రామ్లతండా-వాంకుడోతు సేవ్యానాయక్, ఎండ్లపల్లి-కుంట్ల సుదర్శన్‌రెడ్డి, ఇమాంపేట-నగిరె సుదర్శన్, ఆరెగూడెం-ఆవుదొడ్డి మహేశ్, దాస్తండా-రామావత్ రాంబాబు, లక్ష్మీతండా-జాటోతు బాబ్జినాయక్, రామచంద్రాపురం-గుండగాని అంజ య్య, రత్నపురం-భూపతి శ్రీనివాస్‌గౌడ్, కేసారం-చింత సైదులు, కాసరబాద-రాచకొండ నాగరాజు, పిన్నాయిపాలెం-చనగాని సురేశ్‌గౌడ్, సఫవట్ తండా- బాలు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా పెన్పహడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మిర్యాల వెంకటేశ్వర్లు, గుర్రం అమృతారెడ్డి, నల్లపు శ్రీనివాస్, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, గోవిందరావు, నాగార్జున, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అర్వపల్లి మండలంలో…
అర్వపల్లి : మండలంలోని 19 గ్రామశాఖలకు నూతన కమిటీల ఎన్నిక పూర్తైనట్లు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ తెలిపారు. అర్వపల్లి-కడారి నరేశ్, జాజిరెడ్డిగూడెం-పొన్న హరిప్రసాద్, పర్సాయపల్లి-కొప్పుల భరత్‌రెడ్డి, బొల్లంపల్లి-గోసుల విజయ్, రామన్నగూడెం-ఓర్పు వెంకన్న, సీతారాంపురం-అరిగె వెంకన్న, కొత్తగూడెం-లింగంపల్లి రవిందర్, వేల్పుచర్ల-సంపతి కిరణ్‌కుమార్, కుంచమర్తి-దుబ్బాక ఎల్లంరాజ్, ఉయ్యాలవాడ-పిట్టల నర్సయ్య, అడివెంల-నోముల లింగయ్య, తిమ్మాపురం-కందుల దశరథరామారావు, కోమటిపల్లి-గిలకత్తుల వీరయ్య, సూర్యానాయక్‌తండా-లునావత్ వీరన్న, కొమ్మాల-కుక్కడపు సైదులు, లోయపల్లి-గాదరి వెంకన్న, నాన్యతండా-రమావత్ నాగునాయక్, కోడూరు-నిద్ర సంతోష్, కాసర్లపహాడ్-కస్నబోయిన వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు టీఆర్ఎస్ అనుబంధ కమిటీలను కూడా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, సభ్యులకు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అభినందనలు తెలిపారు.
రామన్నగూడెం, ఏపూరు, మక్తా కొత్తగూడెంలో…
నాగారం : మండలంలోని పలు గ్రామాల టీఆర్ఎస్ గ్రామశాఖ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామన్నగూడెం అధ్యక్షుడిగా వల్లోజు వెంకన్న, ఏపూరు-బషీరొద్దీన్, మక్తా కొత్తగూడెం మట్టపల్లి లింగయ్య, రామోజీతండా-బానోతు జెతియానాయక్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, ఎన్నికల పరిశీలకులు గాయం సంజీవరెడ్డి, ఊట్కూరి సైదులు, జయరాములు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలి
తిరుమలగిరి, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించిందని పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు, సభ్యులతో ఎమ్మెల్యే బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బడుగు ,బలహీన వర్గాలకు సీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు.
మాచనపల్లి గ్రామ కమిటీ
నూతనకల్ : మండలంలోని మాచనపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వేల్పుల లింగయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా మొరిగాల శ్రీనువాస్, మంద గణేశ్, ప్రధాన కార్యదర్శిగా మంద భాస్కర్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచ్ కుందెన అమ్మక్క, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండ సత్తయ్య, బ్రాహ్మండ్లపల్లి యాకుబ్చారి, పసునూటి అయోధ్య, బోర మల్లయ్య, బోర లింగయ్య, బొల్క సందీప్, మల్సూర్ పాల్గొన్నారు.