ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్
మోతె, ఆగస్టు 8 : టీఆర్ఎస్ ప్రభుత్వంలో గడపగడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని తుమ్మలపల్లిలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, గ్రామపంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకే ప్రభుత్వం డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం, పల్లె ప్రగతితో పల్లెల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. పేదింటి ఆడ బిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తుమ్మలపల్లి నుంచి కేశవపురం వరకు రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ముప్పాని ఆశ, జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, తాసీల్దార్ యాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వర్రావు, నూకల మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్, సర్పంచులు వాసంశేట్టి రమేశ్, నూకల యుగంధర్‌రెడ్డి, గుండాల గంగులు, బాబూనాయక్, పురుషోత్తంరావు పాల్గొన్నారు. మండలంలోని తుమ్మలపల్లిలో ఒకరికి, రాఘవాపురం, మామిళ్లగూడెంలో నలుగురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.
కోదాడ టౌన్/మునగాల : ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నడిగూడెం మండలానికి చెందిన ఏడుగురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు ఐదుగురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి, నాయకులు దేవబత్తిని సురేశ్, బాణాల నాగరాజు, బడేటి చంద్రయ్య, గార్లపాటి శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్‌కుమార్, నల్లపాటి శ్రీనివాస్‌రావు, కందిబండ సత్యనారాయణ, యుగంధర్‌రెడ్డి, సీతారాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు లింగారెడ్డి, మునగాల సర్పంచ్ ఉపేందర్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.