విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
గాజులమల్కాపురంలో సీతారామాంజనేయ ఆలయానికి శంకుస్థాపన
పెన్‌పహాడ్, సెప్టెంబర్ 1 : ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గాజులమల్కాపురంలో సీడీఎఫ్ నిధులు రూ.40 లక్షలు, దాతల నుంచి సేకరించిన రూ.10 లక్షలతో సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, సర్పంచ్ బండి ధనమ్మ, ఎంపీటీసీ జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, వైస్ చైర్మన్ వావిళ్ల రమేశ్, బండి రామకృష్ణారెడ్డి, మండాది నగేశ్, మామిడి అంజయ్య, బెల్లంకొండ ఢాంగే, దాతలు ఉప్పల రాంరెడ్డి, బండి మధుసూదన్‌రెడ్డి, బండి ఇంద్రసేనారెడ్డి, బండి రామకృష్ణ్ణారెడ్డి, మోత్కూరి శ్రీనివాస్‌చారి, బండి గిరిధర్‌రెడ్డి, బండి సుధాకర్‌రెడ్డి, రణబోతు వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌రెడ్డి, ఆవుల అంజయ్య, సముద్రాల రాంబాబు, బిట్టు నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
గండూరి ప్రీతంజోనా ట్రస్టు సేవలు అభినందనీయం
బొడ్రాయిబజార్ : సామాజిక సేవా కార్యక్రమాల్లో గండూరి ప్రీతం జోనా ట్రస్టు సేవలు అభినందనీయమని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గండూరి ప్రకాశ్, ప్రవళిక దంపతుల కుమారుడు ప్రీతం జోనా వర్ధంతి సందర్భంగా స్థానిక ఖమ్మం క్రాస్‌రోడ్డులో అమ్మ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కుమారుడి మరణాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోవడం కష్టమైనప్పటికీ దాన్ని అధిగమించి సేవా కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, ప్రకాశ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సెంట్రింగ్ కమిటీకి అభినందన
సూర్యాపేట టౌన్ : జిల్లా సెంట్రింగ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభినందించారు. క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిసింది. దీంతో సంఘం అధ్యక్షుడు నిమ్మల వెంకన్నను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్కే రఫీ, ఉపాధ్యక్షులు చేరాల కోటయ్య, నక్క శ్రీనివాస్, సంకోజు శంకర్, ప్రధాన కార్యదర్శి నర్సింగోజు రాంబాబు, కోశాధికారి నాగరాజు, సభ్యులు వెంకన్న, వలి, శ్రీను, సైదులు, నర్సయ్య, సోమ య్య పాల్గొన్నారు.