అర్వపల్లి జడ్పీటీసీ వీరప్రసాద్ యాదవ్
అర్వపల్లి, ఆగస్టు 31 : గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 2 నుంచి జరిగే టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు కొప్పుల భరత్‌రెడ్డి, బొడ్డు రామలింగయ్య, వల్లపు గంగయ్య, బిక్కూనాయక్, అర్వపల్లి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జెండా పండుగను విజయవంతం చేయాలి
మద్దిరాల టీఆర్ఎస్ జెండా పండుగను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు, పార్టీ మండలాధ్యక్షుడు ఎస్ఏ రజాక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలన్నారు. పార్టీ కొత్త కమిటీల్లో క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలకే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, దుగ్యాల రవీందర్రావు, సూరినేని నర్సింహారావు, మల్లు కపోతంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వీరన్న, మధుసూదన్ పాల్గొన్నారు.
గులాబీ జెండాను వాడవాడలా ఎగురవేయాలి
తిరుమలగిరి సెప్టెంబర్ 2న నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు రఘుందన్రెడ్డి గులాబీ శ్రేణులను కోరారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ కమిటీ, వార్డు, గ్రామ, మండల, పట్టణ, పార్టీ అనుబంధ సంఘాల కమిటీల ఎన్నికలపై కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు. గురువారం వాడవాడలా టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సతీశ్, నాయకులు శ్రీనివాస్, నరోత్తంరెడ్డి, రవీందర్, యాదగిరి పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతకు పాటుపడాలి
తుంగతుర్తి : టీఆర్ఎస్ పటిష్టతకు పాటుపడాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుడిపాటి సైదులు కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2 నుంచి 12వరకు గ్రామ కమిటీలు, అనంతరం మండల నూతన కమిటీ అధ్యక్షులను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, నాయకులు కటకం వెంకటేశ్వర్లు, తాటికొండ సీతయ్య, నల్లు రాంచంద్రారెడ్డి, బీరపూల నారాయణ, ఉయ్యాల వెంకన్న, టీఆర్ఎస్కేవీ నాయకులు సత్యనారాయణగౌడ్, పూర్ణనాయక్, దీప్లానాయక్, రమేశ్, దుర్గయ్య, యాకూనాయక్ పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన నిర్వహించాలి
నాగారం టీఆర్ఎస్ జెండా పండుగను ప్రతి గ్రామంలో నిర్వహించాలని, గ్రామ, మండల కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలగిరి మార్కెట్ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ పానుగంటి నర్సింహారెడ్డి, జిల్లా సభ్యుడు పొదిల రమేశ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కేశగాని అంజయ్య, నాయకులు బాలమల్లు, కిరణ్‌కుమార్, మహేందర్, చంద్రమౌళి, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నూతనకల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య పార్టీ శ్రేణులకు సూచించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2న అన్ని గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలు, 13 నుంచి 20 వరకు మండల స్థాయి కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, వైస్ ఎంపీపీ జక్కి పరమేశ్, సర్పంచ్ చూడి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిక్కి బుచ్చయ్య, గుగులోతు సురేందర్‌నాయక్, బద్దం ప్రశాంత్‌రెడ్డి, జటంగి గణేశ్, లింగయ్య, మధు, విజయ్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.