అడ్డగుట్ట : శ్రావణమాసం రెండవ మంగళవారాన్ని పురస్కరించుకొని తుకారాంగేట్ శ్రీ పహాడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారికి సింధూరం, ఆకుపూజ, తమలపాకులు, జిల్లేడు పూలు, ఆకులతో ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేశామని ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలను నిర్వహించారు.