
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వాన
సిద్దిపేట జిల్లాలో 1.17 సెంటీ మీటర్లు
అత్యధికంగా నారాయణరావుపేటలో 6.43 సెం.మీ
అప్రమత్తంగా ఉండాలి
సదాశివపేట మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి
సిద్దిపేట, ఆగస్టు 28: ఉమ్మడి జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. జోరువానతో చెరువులు, కుంటల్లో నీరు చేరి జలకళ సంతరించుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో సరాసరిగా 1.17 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారాయణరావుపేటలో 6.43 సెం.మీ నమోదు కాగా, మండలాల వారీగా దుబ్బాకలో 0.51 సెంటీ మీటర్లు, సిద్దిపేట రూరల్‌లో 1.90 సెం.మీ, చిన్నకోడూరులో 0.08 సెం.మీ, బెజ్జంకిలో 0.59 సెం.మీ, కోహెడలో 1.05 సెం.మీ, హుస్నాబాద్‌లో 0.20 సెం.మీ, అక్కన్నపేటలో 2.90 సెం.మీ, నంగునూరులో 3.22 సెం.మీ, సిద్దిపేట అర్బన్‌లో 2.04 సెం.మీ, తొగుటలో 1.06 సెం.మీ, మిరుదొడ్డిలో 0.24 సెం.మీ, దౌల్తాబాద్‌లో 0.54 సెం.మీ, రాయిపోల్‌లో 0.92 సెం.మీ, వర్గల్లో 1.39 సెం.మీ, ములుగులో 0.77 సెం.మీ, మర్కూక్‌లో 0.38 సెం.మీ, జగదేవ్‌పూర్‌లో 0.06 సెం.మీ, గజ్వేల్‌లో 0.21 సెం.మీ, కొండపాకలో 0.18 సెం.మీ, కొమురవెల్లిలో 1.18 సెం.మీ, చేర్యాలలో 1.48 సెం.మీ, మద్దూరులో 0.13 సెం.మీ, ధూళిమిట్టలో 0.50 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..