
ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, ఆగస్టు 27 : ప్రజలకు అనునిత్యం సేవలందిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల అభివృద్ధి గురించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించారు. క్రీడాపోటీలను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారు. త్వరలో 20 ఎకరాల్లో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషితో క్రీడాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రత్యేకంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం ఫుట్‌బాల్ క్రీడాకారులకు టీషర్టులను పంపిణీ చేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు శ్యామల మల్లేశం, కిషన్‌రెడ్డి, శిరీష, రాజు, రహీం, రవీందర్, నాయకులు విరాసత్ అలీ, వాలీబాల్ వైస్‌ప్రెసిడెంట్ హైదర్ పటేల్, ఉపాధ్యాయ సంఘం నాయకులు శశిధర శర్మ పేట సంఘం సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.