
జిల్లావ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో పారిశుధ్య పనులు
పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
సిద్దిపేట, ఆగస్టు 26 : విద్యాసంస్థలు 1వ తేదీ నుంచి పున: ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణంలో పాఠశాలలను ము న్సిపల్ పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. పాఠశాలల్లో చేపట్టిన పరిశుభ్రత పనులను మున్సిపల్ ఆసిస్టెంట్ కమిషనర్ నర్సయ్య పర్యవేక్షించారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో ప్రతి 5 పాఠశాలలకు 1 క్లస్టర్ ఆఫీసర్ చొప్పున 30 మంది క్లస్టర్ అధికారులను నియమించామన్నారు. వీరి ఆధ్వర్యంలో పాఠశాలల్లో పనులను పరిశీలించి, పర్యవేక్షిస్తారని తెలిపారు.
పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు
దుబ్బాక/చేర్యాల, ఆగస్టు26 : విద్యాసంస్థలు ప్రారంభమవుతుండడంతో తరగతి గదులను హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేస్తున్నారు. దుబ్బాక ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలను మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి, కమిషనర్ గణేశ్‌రెడ్డి సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కోసం నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. తరగతి గదలు, కార్యాలయాలను పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. వారి వెంట కౌన్సిలర్ దేవుని లలిత, ఉపాధ్యాయులు ఉన్నారు.
చేర్యాల మున్సిపాలిటీలోని పాఠశాలలను మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపరాణి, కమిషనర్ రాజేంద్రకుమార్ సందర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కనకమ్మయాదగిరి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, భిక్షపతి ఉన్నారు.
పరిశుభ్రంగా మార్చాలి : డీఆర్డీవో
దౌల్తాబాద్/ మిరుదొడ్డి, ఆగస్టు 26 : ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఈ నెల 30లోగా పరిశుభ్రంగా ఉంచాలని డీఆర్డీవో గోపాల్‌రావు ఆదేశించారు. మండల పరిధిలోని దొమ్మాట, సూరంపల్లిలోని పాఠశాలలను సందర్శించారు. వంట సామగ్రిని పరిశుభ్రంగా నిత్యం కడగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగాధరి సంధ్య, సర్పంచ్ కొమ్మెర పూజిత, ఎంపీడీవో మచ్చేందర్ పాల్గొన్నారు. మిరుదొడ్డి మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాలను డీఆర్డీవో గోపాల్‌రావు సందర్శించారు.
మరమ్మతులు చేయించాలి : డీపీవో
బెజ్జంకి/ రాయపోల్, ఆగస్ట్టు 26 : ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా మార్చాలని డీపీవో పార్ధసారథి సూచించారు. బెజ్జంకి మండలకేంద్రంతోపాటు, వీరాపూర్, లక్ష్మీపూర్, దేవక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు పరిశీలించారు. వీరి వెంట సర్పంచ్‌లు మంజుల, బాపురెడ్డి, ఎంపీవో మంజుల, ఎంఈవో పావని ఉన్నారు.
రాయపోల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయిస్తున్నట్లు ఎంపీపీ అనితాశ్రీనివాస్, జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో తహసీల్దార్ శ్రీవల్లి, ఎంఈవో నర్సవ్వ, ఎంపీడీవో రాజేశ్‌కుమార్, ఏంపీవో నర్సింహరావు, సర్పంచ్ మౌనికారాజిరెడ్డి పాల్గొన్నారు. రాయపోల్ మండలంలోని మంతూర్ పాఠశాలను సర్పంచ్ వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల భవనానికి రంగులు వేయించారు.
ప్రతి గదిని శానిటైజేషన్ చేయాలి
దౌల్తాబాద్/ మిరుదొడ్డి/మద్దూరు, ఆగస్టు 26 : 1 అన్ని ప్రభుత్వ పాఠశాలలను శుభ్రపరచాలని తహసీల్దార్ నీలిమ అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని అప్పాయిపల్లి, మచిన్‌పల్లి, శేరిల్ల, ఇందూప్రియాల్ గ్రామాల్లోని పాఠశాలలను తహసీల్దార్ నీలిమ సందర్శించారు. ఆమె వెంట ఆర్ఐ ప్రభాకర్‌రావు, సర్పంచ్ సుగుణ, ఉపసర్పంచ్ ప్రభాకర్ ఉన్నారు.
మిరుదొడ్డి మండలంలోని పాఠశాలల్లో పరిశుభ్రత పనులను పూర్తి చేయాలని అధికారులను ఎంపీపీ సాయిలు, సర్పంచ్ బాల్‌రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయకుడు సూకురి లింగం కోరారు. మిరుదొడ్డిలోని బాలుర, బాలికల జడ్పీ పాఠశాలలను, లక్ష్మీనగర్‌లో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, ఎం పీడీవో రాజిరెడ్డి, ఎంఈవో ప్రభుదాస్, సర్పంచ్‌లు రాములు, సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.
మద్దూరు మండలం లద్నూర్లోని పాఠశాలలను ఎంపీవో సుధీర్‌తో కలిసి తహసీల్దార్ నరేందర్ సందర్శించారు. వారి వెంట సర్పంచ్ సుదర్శన్, ఏఎస్వో మహేందర్ ఉన్నారు.
‘కొవిడ్’ రూల్స్ పాటించాలి : ఆర్డీవో
హుస్నాబాద్/ హుస్నాబాద్ రూరల్, ఆగస్టు 26 : పాఠశాలల్లో విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆర్టీవో జయచంద్రారెడ్డి, ఇన్చార్జి ఏఎస్పీ మహేందర్ సూచించారు. హుస్నాబాద్‌లోని సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్లో సమీక్ష నిర్వహిం చారు. తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. సమీక్షలో ఎంఈవో అర్జున్, హెచ్ఎం మనీల పాల్గొన్నారు. హుస్నాబాద్ రూరల్ మండలంలోని మహ్మదాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఎల్పీవో రాజీవ్‌కుమార్ సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో అనిత, సర్పంచ్ పిట్టల సంపత్, ప్రధానోపాధ్యాయులు కొత్తపల్లి మహేందర్ ఉన్నారు.