
‘రేవంత్‌రెడ్డి.. నోరు జాగ్రత్త! ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతాం’.. అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని 70ఏండ్ల కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విడిపించి అభివృద్ధి చేస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఓటుకు నోటు కేసుతో టీడీపీని భ్రష్టు పట్టించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. సీఎం కావాలన్న అత్యాశతో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.
గజ్వేల్, ఆగస్టు 25: ‘రేవంత్ రెడ్డి.. నోరు జాగ్రత్త.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాడ్లితే బుద్ధి చెప్పేదాకా ఊరుకోమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతాన్ని 70 ఏండ్ల కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విడిపించి అభివృద్ధి చేస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. బుధవారం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలతో తెలంగాణ ప్రజల బతుకులు పూర్తి అధ్వానంగా మారాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రాణాన్ని ఫణంగా పెట్టి, రాష్ర్టాన్ని సాధించారన్నారు. ప్రత్యేక రాష్ట్రంతోనే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లాంటి గొప్ప సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకొని, గజ్వేల్ అభివృద్ధి చెందుతున్నదన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు అందిస్తూ ప్రజలు సంతోషంగా జీవించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
గజ్వేల్ పట్టణంతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, అలాం టి గజ్వేల్ ప్రజలను తొక్కుకుంటూ గజ్వేల్‌కు వస్తామని రేవంత్‌రెడ్డి మాట్లాడడంపై అతడి విచక్షణకు నిదర్శమని ఎఫ్డీసీ చైర్మన్ అన్నారు. దాని ని తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మా ట్లాడితే తగిన బుద్ధి చెప్పేదాక ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ర్టాన్ని ఏడేండ్లలోనే గణనీయం గా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణలో, గజ్వేల్‌లో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏ ఊరికి వెళ్లినా అద్భుతమైన రహదారులు, సకల మౌలిక వసతులతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఒక్కసారి ఊర్లలోకి వెళ్లి చూడాలన్నారు.
దొంగదీక్షలతో ఓట్లేసిన ప్రజలనే రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసుతో టీడీపీని భ్రష్టు పట్టించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. సీఎం కావాలన్న అ త్యాశతో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. గజ్వేల్‌లో జెండా ఎగురవేస్తామంటూ పనికిరాని ప్రగల్భాలు పలకడం మానుకోవాలని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మేలు జరిగేలా మసలుకోవాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమంలో ఏవైనా తప్పిదాలు దొర్లితే చూపితే సరిచేసుకుంటామని, అంతేగానీ, కేవలం అధికారం కోసం పాకులాడుతూ అనవసరమైన మాటలు మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు బబ్బూరి రజిత, రహీం, లక్ష్మీకిషన్రెడ్డి, శ్యామలామల్లేశం, బొగ్గుల చందు, భాగ్యలక్ష్మీదుర్గాప్రసాద్, నాయకులు హన్మంత్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.