
ఆహారభద్రత చట్టం పక్కాగా అమలు చేస్తాం
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి
నీట మునిగిన పంట చేలుగజ్వేల్, సెప్టెంబరు7: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఆహార కమిషన్ పనిచేస్తున్నదని చైర్మన్ తిరుమలరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో రేషన్ దుకాణంలో సరుకుల పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సరుకుల పంపిణీ పై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆహారభద్రత చట్టం 2003 అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ములుగు, వర్గల్లో అంగన్వాడీ కేంద్రాల ను, గజ్వేల్, రాయపోల్ మండలాల్లో రేషన్ దుకాణాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో హక్కుల వినియోగం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిల్లో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రేషన్ దుకాణానికి విజిలెన్స్ కమిటీని కచ్చితంగా ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్ అన్వర్‌ను ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఆహారభద్రత, ప్రజాపంపిణీ వ్యవస్థ బాధ్యతలను సంబంధిత అధికారులు పటిష్టంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాలరావు, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియొద్దీన్, కౌన్సిలర్ రహీం, డీఈవో రవికాంతారావు, సీడీపీవో వెంకటరాజమ్మ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ హరీశ్, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, ఎంఈవో సునీత, ఆర్ఐ ప్రవీణ్ తదితరులున్నారు.
పౌష్టికాహార పంపిణీలో ఇబ్బందులు రావొద్దు
వర్గల్, సెప్టెంబర్ 7: గ్రామాల్లో బాలింతలు, శిశు ఆరోగ్య సంరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి వర్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశవర్కర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులతోపాటు గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్ వాణిరెడ్డి, ఎం పీడీవో మేరి స్వర్ణకుమారి, వర్గల్ ప్రభుత్వ వైద్యబృందం, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి
రాయపోల్, సెస్టెంబర్ 7: మండల పరిధిలోని రాంసాగర్ రేషన్ దుకాణంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో రవికాంత్‌రావు, డీఎంచ్వో మనోహర్, డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు, సివి ల్ సప్లయ్ డీఎం హరీశ్, డీబ్ల్యూవో రాంగోపాల్‌రెడ్డి, ఎంపీపీ కల్లూరి అనిత, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ కల్లూరి అనిత, జడ్పీటీసీ యాదగిరి, మార్కెట్ చైర్మన్ పడకంటి శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీవల్లి, ఎంపీడీవో రాజేశ్‌కుమార్, గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యరాణి, ఎంపీటీసీ లక్ష్మి పాల్గొన్నారు.