
జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ
గ్రామాల్లో కమిటీ ఎన్నికల సందడి
నియామక పత్రాలు అందజేసిన నాయకులు
దుబ్బాక/మిరుదొడ్డి, సెప్టెంబర్ 7 : సీఎం కేసీఆర్ నాయక త్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గ్రామాల్లో మం గళవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. బ ల్వంతాపూర్ గ్రామాధ్యక్షుడిగా సౌడ సాయికుమార్, గంభీర్పూర్ గ్రామ అధ్యక్షుడిగా చింటు మైసయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, నాయకులు మల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, బండి రాజు, చెట్టి దేవరాజ్ పాల్గొన్నారు.
మిరుదొడ్డి మండలంలో అక్బర్పేట గ్రామాధ్యక్షుడిగా మం డల కుమార్, కూడవెల్లి గ్రామాధ్యక్షుడిగా ఎమ్మ శంకర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నేత లింగం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు స్వరూప, సుగుణాణ, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బైరయ్య పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేయాలి
గజ్వేల్ రూరల్/మర్కూక్/కొండపాక, సెప్టెంబర్ 7 : ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని కార్యకర్తలకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధు పిలుపునిచ్చారు. శ్రీగిరిపల్లి, కొమటిబండ, మక్తమసాన్పల్లి, బంగ్లావెంకటాపూర్ గ్రామాల్లో కమిటీలను నియమించారు. శ్రీగిరిపల్లి గ్రామాధ్యక్షుడిగా బాల్‌రాజ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ చంద్రమోహన్‌రెడ్డి, నేతలు రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య, రమేశ్‌గౌడ్, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. మర్కూక్ మండలం పాములపర్తిలో గ్రామాధ్యక్షుడిగా పిట్ల మహేశ్, కార్యదర్శిగా శిగిరిపల్లి కృష్ణ, ఇప్పలగూడెం గ్రామాధ్యక్షుడిగా కొల్కూరి అంజిరెడ్డి, కార్యదర్శిగా శ్రీనివాస్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, నేతలు సత్యనారాయణ, హరిపంతులు, కనకయ్య, నరేందర్‌రెడ్డి, రాములు, సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి, ధర్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
కొండపాక మండలంలోని రాంపల్లి, మర్పడగ గ్రామాల్లో కమిటీలను హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుమార్‌యాదవ్ ప్రకటించారు. రాంపల్లి గ్రామాధ్యక్షుడిగా ఎలక రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ల్యాగల బాల్‌రెడ్డి, మర్పడ గ్రామాధ్యక్షుడిగా చెల్లాపురం కనకయ్య, ప్రధాన కార్యదర్శిగా తుప్పతి ప్రభాకర్ ఎన్నికయ్యా రు. కార్యక్రమంలో ఆర్బీఎస్ కోఆర్డినేటర్ దుర్గయ్య, ఎంపీటీసీ సాయిబాబా, మాజీ ఎంపీపీలు కనకయ్య, రాధాకిషన్‌రెడ్డి, నేతలు మంచాల శ్రీనివాస్, అనంతుల నరేందర్, ఏగుర్ల వెంకటేశం, ఐలయ్య, బూర్గుల సురేందర్, రాజు ఉన్నారు.
తెలంగాణ గుండె చప్పుడు టీఆర్ఎస్ పార్టీ
చేర్యాల/కొమురవెల్లి/హుస్నాబాద్‌రూరల్, సెప్టెంబర్ 7 : తెలంగాణ గుండె చప్పుడు టీఆర్ఎస్ పార్టీ అని జడ్పీటీసీ శెట్టె మల్లేశం అన్నారు. మండలంలోని నాగపురి, శబాష్‌గూడెం, చుంచనకోట గ్రామాల్లో కమిటీ ఎన్నిక నిర్వహించారు. నాగపురి గ్రామాధ్యక్షుడిగా భీమ రాజు, శభాష్‌గూడెం అధ్యక్షుడిగా జి.కనకయ్య, చుంచనకోట అధ్యక్షుడిగా ఆది రాజు ఎన్నికయ్యారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కరుణాకర్, వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి, టీఆర్ఎస్వై మండల అధ్యక్షుడు దినేశ్తివారి, ఎంపీటీసీ బాలరాజు, మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నేతలు అయ్యాలం, యాదగిరి ఉన్నారు. కొమురవెల్లి మండలంలోని మర్రిముచ్చాల, గౌరాయపల్లి, రాంసాగర్, లెనిన్‌నగర్ గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్దప్ప ఆధ్వర్యంలో కమిటీలను నియమించారు. మర్రిముచ్చాల గ్రామాధ్యక్షుడిగా చదరుపల్లి నర్సింగరావు, గౌరాయపల్లి అధ్యక్షుడిగా నర్ర రఘువీరరెడ్డి, రాంగసాగర్ అధ్యక్షుడిగా అక్కెనపల్లి యాదవరెడ్డి, లెనిన్‌నగర్ అధ్యక్షుడిగా దాసరి మశ్చేందర్ ఎన్నికయ్యారు.
హుస్నాబాద్‌రూరల్ మండలంలోని కూచనపల్లిలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గూళ్ల పైడి, ఉపాధ్యక్షుడిగా నీరటి రవీందర్, కార్యదర్శిగా సోయం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా తాళ్లపల్లి రాములు, కోశాధికారిగా రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యా రు. కార్యక్రమంలో ఎంపీపీ మానస, మార్కెట్ చైర్మన్ అశోక్ బాబు, మాజీ ఎంపీపీ వెంకట్, టీఆర్ఎస్వై మండలాధ్యక్షు డు భూక్య రమేశ్‌నాయక్, సర్పంచ్ రామచంద్రారెడ్డి, నేతలు గాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మహేశ్, రవీందర్‌రెడ్డి ఉన్నారు.
కోహెడ మండలంలో గ్రామశాఖల ఎన్నికలు
కోహెడ, సెప్టెంబర్ 7 : మండలంలోని వింజపల్లి, ఆరెపల్లి, ఎర్రగుంటపల్లి నకిరెకొమ్ముల గ్రామ శాఖలు ఏకగ్రీవం కాగా, శ్రీరాములపల్లిలో పెండింగ్‌లో ఉన్నది. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పరిశీలించి, కమిటీల పేర్లు ను ప్రకటిస్తామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.