అంబర్పేట : నల్లకుంటలోని శివంలో భగవాన్ శ్రీసత్యసాయి 96వ జయంతి వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా తెల్లవారుజామున ఓంకారం, సుప్రభాతం, బాబా రథయాత్ర నిర్వహించారు. ఈ రథయాత్రలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శివం నుంచి డీడీకాలనీ, సాయిబాబానగర్ల మీదుగా యాత్ర సాగింది.
మధ్యాహ్నం శివం ప్రాంగణంలో శ్రీసత్యసాయి వ్రతాలు జరిగాయి. అనంతరం మహా నారాయణ సేవ (అన్నదానం) నిర్వహించారు. సాయంత్రం వేదపఠనం, భజన, జ్యోతి ప్రజ్వలన గావించారు. శ్రీసత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు తమ ఆర్గనైజేషన్ ద్వారా చేపడుతున్న సేవలను వివరించారు.
బర్త్డే కేక్ కట్ చేసి ఆకాశంలోకి బెలూన్స్ ఎగురవేశారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. ఉయ్యాలోత్సవం (జోల) జరిపారు. నగరం నలుమూలల నుంచి భక్తులు ఇందులో పాల్గొన్నారు.