
‘పటాన్చెరు’లో ఎన్నడూ లేని ప్రగతి
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మున్సిపాలిటీలు
శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి
తెల్లాపూర్‌లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు
ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రామచంద్రాపురం/అమీన్పూర్, ఆగస్టు 13 : సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని, తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూరులో రూ.1.54 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో నంబర్‌వన్‌గా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ఏడేండ్లలో పటాన్చెరు నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు శ్రీశైలం, బాలాజీ, రవీందర్‌రెడ్డి, మయూరిరాజుగౌడ్, లచ్చిరాం, జ్యోతిశ్రీకాంత్రెడ్డి, చిట్టి ఉమేశ్వర్, కోఆప్షన్ సభ్యులు శ్రీపాల్‌రెడ్డి, మంజుల, అధికారులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే వారిగుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆహ్వానం మేరకు తొలిసారి అమీన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయనను పాలకమండలి సభ్యులు, అధికారులు సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, 111 డివిజన్ కార్పొరేటర్ సింధు, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు బాసెట్టి కృష్ణ, కోఆప్షన్ సభ్యుడు తలారి రాములు, యూనుస్, నాయకులు గోపాల్, మహేందర్‌రెడ్డి ఉన్నారు.