
కాట్రియాల గ్రామ అధ్యక్షుడిగా బస్వయ్య
రామాయంపేట, సెప్టెంబర్ 8: మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీలు జోరందుకున్నాయి. మండలంలోని కాట్రియాల, తొనిగండ్ల గ్రామాలతో పాటు రామాయంపేట పట్టణంలోని వార్డు కమిటీలు పూర్తి చేసినట్లు రామాయంపేట మండల అధ్యక్షుడు పల్లె జితేందర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పుట్టి యాదగిరి అన్నారు.బుధవారం క్యాంపు కార్యాలయంలో తొనిగండ్ల గ్రామ కమిటీ జాబితాను మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు గ్రామస్తులు అందజేశారు. కాట్రియాల గ్రామ కమిటీని సర్పంచ్ శ్యాములు, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు కమ్మరి రమేశ్, నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మైలారం బస్వయ్య, ఉపాధ్యక్షుడిగా నక్క సిద్ధిరాములు, ప్రధాన కార్యదర్శిగా మల్లేశం, సంయుక్త కార్యదర్శిగా కంది కొండల్‌రెడ్డి, కోశాధికారిగా వెంకట్రాం, యువజన కమిటీ అధ్యక్షుడిగా సింధు మధు, బీసీ కమిటీ అధ్యక్షుడిగా ఆంజయ్య, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా నక్క సతీష్, ఎస్టీ కమిటీ అధ్యక్షుడిగా లంబాడీ బాబు, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా కుర్మ రేణమ్మ, రైతు కమిటీ అధ్యక్షుడిగా మహేందర్రెడ్డిలను ఎన్నుకున్నారు. రామాయంపేట పట్టణం లోని 11వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా చింతల ఏసుపాల్ను వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్, వార్డు ప్రజల సమక్షంలో అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.
బీంరావ్పల్లిలో ….
చేగుంట, సెప్టెంబర్ 8: నార్సింగి మండల పరిధిలోని బీంరావ్పల్లిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, ఎంపీపీ సబిత, సర్పంచ్ ఎల్లమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీంరావ్పల్లి గ్రామ అధ్యక్షుడిగా శ్రీశైలం, ఉపాధ్యక్షుడు చిన్నరాములు ఎకగ్రీవంగా ఎన్నికైన్నారు. కార్యదర్శిగా కాపు రఘుపతి, కార్యవర్గ సభ్యులుగా నర్సింహులు, భిక్షపతి, బోయిని చిన్న రాములు, కొంగల యాదగిరి, జనార్దన్, చంద్రం ప్రశాంత్, నర్సింహులు ఎన్నికైయ్యారు. కార్యక్రమంలో నాయకులు హరిదాసు, చిందం రవీందర్, బోయిని స్వామి, సుందరమ్మ, గోవర్ధన్, రాజమణి, నర్సింహులు, నరేశ్, బాలకృష్ణ తదితరులున్నారు.
చెట్లతిమ్మాయిపల్లి గ్రామ అధ్యక్షుడిగా నరేశ్
మండల పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లిలో సర్పంచ్ మోహన్‌రాథోడ్, ఎంపీటీసీ హోళియనాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. చెట్లతిమ్మాయిపల్లిగ్రామ అధ్యక్షుడిగా నరేశ్, ఉపాధ్యక్షుడిగా మ ల్లేశ్ , కార్యవర్గ సభ్యులుగా మోహన్‌నాయక్, ప్రభాకర్, కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముఖేశ్‌గౌడ్, అంజాగౌడ్, యా దిరెడ్డి, విజయ్‌బాబు, నర్సాగౌడ్, బాలకృష్ణ, కమ్మరి రాజు, బోనాల బాలు ,రత్నం తదితరులున్నారు.
వెల్దుర్తిలో…..
వెల్దుర్తి, సెప్టెంబర్ 8:వెల్దుర్తి మండలంలో టీఆర్ఎస్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, వెల్దుర్తి-2 ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, నాయకుడు నరేందర్‌రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ కమిటీలను ఏకగ్రీవం చేస్తున్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తితో పాటు మండలంలోని మానేపల్లి, యశ్వంతరావుపేట, ఆరెగూడెం గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెల్దుర్తి అధ్యక్షుడిగా కొత్త గంగాధర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా మల్లేశ్, శ్రవణ్, ప్రధాన కార్యదిర్శగా రమేశ్, మానేపల్లి గ్రామ అధ్యక్షుడిగా రాములు ఉపాధ్యక్షుడిగా నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీశైలం, యశ్వంతరావుపేట గ్రామ అధ్యక్షుడిగా శ్రీను, ఉపాధ్యక్షుడిగా అశోక్, ప్రధాన కార్యదర్శిగా భూమయ్య, ఆరెగూ డెం గ్రామ అధ్యక్షుడిగా బాలకిషన్, ఉపాధ్యక్షులుగా రాజ య్య, బాబు, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులులతో పా టు పూర్తిస్థాయి కార్యవర్గాలను ఎన్నుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల కమిటీల ఎన్నికను పూర్తిచేసి కమిటీల వివరాలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు నాయకులు తోటనర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్ కిష్టయ్య, రమేశ్చందర్, సోమప్ప, శాఖారం శ్రీను, వెంకటేశం, ఎల్లం, లక్ష్మణ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నిజాంపేటలో….
నిజాంపేట,సెప్టెంబర్ 8: తెలంగాణలో టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమైందని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నా రు. ఆయన నందిగామలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్, కార్యదర్శిగా బాజ అంజయ్య, కోశాధికారిగా ఆకుల రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌కు ఎంపీపీ సిద్ధిరాములు నియమాక పత్రం అందజేశా రు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి ,టీఆర్ఎస్ నాయకులు దా సు, దయాకర్, రాజ్‌గోపాల్, ఎల్లం, సురేశ్, బుచ్చ నర్సింహులు, రైతు బంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారు.
పైతర గ్రామ అధ్యక్షుడిగా మల్లేశం
కొల్చారం, సెప్టెంబర్ 8: మండల పరిధిలోని పైతర గ్రామ టీఆర్ఎస్, అనుబంధ సంస్థల కమిటీలుఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భానుప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీ ఆరట్ల ఎల్లయ్య సమక్షంలో కమిటీలను వేశారు. పైతర గ్రామ అధ్యక్షుడిగా లింగంపల్లి మల్లేశం, యూత్ కమిటీ అధ్యక్షుడిగా బోయిన ఆంజనేయిలు, బీసీ కమిటీ అధ్యక్షుడిగా నర్సింహులు, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా ఎర్ర రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.