
రామాయంపేట, సెప్టెంబర్ 1 : ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నా రు. బుధవారం రామాయంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలోని మౌలిక వసతులను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసి వారితో ముచ్చటించారు. ప్రభుత్వం విద్యార్థుల చదువులు వెనుకబాటుకు గురికావొద్దనే ఉద్దేశంతోనే పాఠశాలలను పునఃప్రారంభించిందన్నారు. విద్యార్థుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో వాటర్ బకెట్, జగ్గు, మాస్క్‌లు, భౌతికదూరం పాటించే విధంగా విద్యాబోధన చేపట్టాలన్నారు.
పట్టణంలోని మార్కండేయ దేవాలయ నాలుగో వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేను పద్మశాలీలు, ఆలయ కమిటీ చైర్మన్ మద్దెల సత్యనారాయణ ఆహ్వానించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా, పట్ణంలోని డీ. ధర్మారం క్రాస్ రోడ్డులో నూతన పెట్రోల్‌బంక్‌ను ప్రారంభించారు.ఎమ్మెల్యేను రామాయంపేట వైస్ ఎం పీపీ స్రవంతి దంపతులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 1: పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఎమ్మెల్యే దత్తత గ్రా మం బూర్గుపల్లిలో రూ.35.2లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బూర్గుపల్లి గ్రామాన్ని రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. మండల కేంద్రమైన హవేళీఘనపూర్‌లో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సవిత, వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి నిధులు మం జూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
లైబ్రరీకి రూ.1.50లక్షలు అందజేసిన
బూర్గుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లైబ్రరీలో పుస్తకాల కోసం యువజన సంఘాల తరఫున రూ.1.50లక్షలు అందజేసిన అరుణ్‌కుమార్‌ను మెదక్ ఎమ్మెల్యే శాలువా కప్పి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, జడ్పీటీసీ సుజాత, సర్పంచ్ చెన్నాగౌడ్, ఎంపీటీసీ అర్చన, ఎంపీడీవో శ్రీరామ్, ఎంఈవో నీలకంఠం, ప్రధానోపాధ్యాయుడు మదన్, మం డల కో-ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.