ఇబ్రహీంపట్నం, ఆగస్టు 11 : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు ప్రకటించడంతో పౌల్ట్రీ, పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ మీటర్ల ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు వస్తుండటంతో దీనిని గమనించిన ప్రభుత్వం రైతులకు బిల్లుల భారం తగ్గించాలనే ఉద్దేశంతో యూనిట్‌కు రూ.2చొప్పున సబ్సిడీ అందజేయడం పాడి, లేయర్, బ్రాయిలర్ ఫారాలతో పాటు పౌల్ట్రీ అనుబంధ రంగాలైన హేచరీస్, ఫీడ్ మిక్సింగ్ప్లాంట్లకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. దీంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గనుందని ఈ విషయమై గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పౌల్ట్రీ, పాడి రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పౌల్ట్రీ రంగానికి సబ్సిడీ విద్యుత్ అందజేయడం మంచి నిర్ణయం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆచరణలో కూడా తీసుకురాలేదు. కరోనాతో నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్న పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం రూ.2సబ్సిడీ అందజేయడం సంతోషకరం.
వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు సబ్సిడీ విద్యుత్ అందజేస్తామని ప్రకటించడం సంతోషకరం. విద్యుత్ బిల్లులు భారమవుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీతో భారం తగ్గుతుంది.