
-ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 8 : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృష్ణయ్య ఉద్యోగోన్నతిపై డిస్ట్రిక్ట్ సెక్టోరల్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు. దీంతో మండల ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రాధా గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. డిస్ట్రిక్ట్ సెక్టోరియల్ ఆఫీసర్ కృష్ణయ్య దంపతులను పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ గణేశ్, కొత్తూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ లావణ్య, వైస్‌చైర్మన్ రవీందర్‌యాదవ్, ఎంఈవో కృష్టారెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గుప్తా పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 8 : మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్ రాములు ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కులను అంజయ్యయాదవ్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై 11మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్‌ముదిరాజ్, ఎంపీడీవో జ్యోతి, వైస్ ఎంపీపీ శోభలింగం, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, వైస్‌చైర్మన్ రవీందర్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.
ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 8 : ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో బుధవారం శివరాజ్, విష్ణు, మహేశ్, రామనాయుడు, రఘుతోపాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషిచేయాలన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నందిగామ, సెప్టెంబర్ 1 : ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ ప్రియాంకగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి బుధవారం ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఎజెండా చదివి వినిపించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కావాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మంజూల, ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, రాజునాయక్, కట్న లత, మాధవి, కళమ్మ, కో అప్షన్ సభ్యులు బేగ్, సర్పంచ్‌లు కవిత, రాములమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.