ఆమనగల్లు, ఆగస్టు 8 : మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గొల్లకురుమ సంఘం నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.6వేల కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కడ్తాల్, ఆగస్టు 8 : కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థికాభివృద్ధి సాధించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించడానికి దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 7 లక్షల 60 వేల కుటుంబాలకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు అందజేస్తున్నదన్నారు. పంపిణీలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. అవకతవకలు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పశుసంవర్ధకశాఖ జేడీ అంజలప్ప మాట్లాడుతూ జీవాలు ఆరోగ్యంగా ఉండటానికి ఏటా మూడు సార్లు నట్టల నివారణ మందు వేయించాలన్నారు. మండలంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే మీట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే, జేడీ, ప్రజాప్రతినిధులను గొర్రెల కాపరుల సంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, భాగ్యమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, మంజుల, గోపాల్, సీఐ ఉపేందర్, ఎస్సై హరిశంకర్‌గౌడ్, నాయకులు జహంగీర్‌అలీ, లక్పతినాయక్, లాయక్‌అలీ, గిరియాదవ్, చంద్రమోళి, జంగయ్యగౌడ్, వినోద్, ముత్యాలు, గోపాల్, మండల పశువైద్యాధికారి విజయ్‌కుమార్, జేవీవోలు రజిత, మల్లేశ్, వెంకటయ్య, రమేశ్, బురాన్, చెన్నయ్య, వాల్యా, నవీన్, శ్రీశైలం, రైతులు పాల్గొన్నారు.
తలకొండపల్లి, ఆగస్టు 8 : మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరై ప్రారంబించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు స్వప్న, లక్ష్మీనరసింహారెడ్డి, ఎంపీటీసీ వందన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డాక్టర్ అంజిలప్ప, శంకరయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.