
ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 5 : కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తులేకలాన్, పోల్కంపల్లి గ్రామాల టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తులేకలాన్ నూతన గ్రామశాఖ అధ్యక్షుడిగా గుజ్జ యాదగిరి, ఉపాధ్యక్షులుగా చెనమోని మహేశ్, సుర్వి జనార్దన్, పోల్కంపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిగా గుండ్ల ధానయ్యగౌడ్, ఉపాధ్యక్షులుగా ఈరపట్నం శ్రీనివాస్, గునుకుల మల్లేశ్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు గణేష్, రవీందర్, చెరుకూరి గిరి, సర్పంచ్‌లు బూడిద రాంరెడ్డి, చిలుకల యాదగిరి, నాయకులు మహేందర్‌రెడ్డి, దాసు, జగదీష్, ఎంపీటీసీ నాగమణి, బుగ్గరాములు, బీరప్ప, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో వార్డు కమిటీలు ఏర్పాటు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 5 : మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో నూతన కమిటీలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా 6, 7, 8, 9, 21వ వార్డుల్లో ఆదివారం నూతన కమిటీలను నియమించారు. 6వ వార్డు అధ్యక్షుడిగా సొప్పరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా సద్దాం, 7వ వార్డు అధ్యక్షుడిగా వంశీ కృష్ణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అవుతాపురం రవీందర్, 8వ వార్డు అధ్యక్షుడిగా శివ, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, 9వ వార్డు అధ్యక్షుడిగా డొంకని గోపీగౌడ్, ప్రధాన కార్యదర్శిగా కాకి తిరుమల్‌రావు, 21వ వార్డు అధ్యక్షుడిగా వనమాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా సతీశ్‌చంద్రను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో..
తుర్కయాంజాల్, సెప్టెంబర్ 5 : మున్సిపాలిటీలోని కొహెడ గ్రామంలో టీఆర్ఎస్ వార్డు కమిటీలను ఎన్నుకున్నారు. కందాళ బిందు రంగారెడ్డి, గుండోజు బ్రహ్మచారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బలదేవరెడ్డి సమక్షంలో ఎన్నిక జరిగింది. 2వ వార్డు అధ్యక్షుడుగా బుడ్డ విజయ్ బాబు, ప్రధాన కార్యదర్శిగా శీలం మానయ్య, ఉపాధ్యక్షుడిగా కోమిరిశెట్టి కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడిగా శీలం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా పంది నర్సింహ, 4వ వార్డు అధ్యక్షుడిగా పల్లపు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా పసుల దేవేందర్ ముదిరాజ్, యువజన విభాగం అధ్యక్షుడిగా శిక ప్రకాశ్ గౌడ్, కార్యకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.10వ వార్డు అధ్యక్షుడిగా నల్లవెళ్లి కార్తిక్, ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి ధర్మకన్న, 11వ వార్డు అధ్యక్షుడిగా కొత్తకుర్మ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా గుండా రాజు, 12వ వార్డు అధ్యక్షుడిగా కొల్లూరు నిరంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జొన్నడ యశ్వంత్ రెడ్డి, 21వ వార్డు అధ్యక్షుడిగా కొంతం యాదిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గౌని రాజు, 18వ వార్డు అధ్యక్షుడిగా తమ్మల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బందనంద రవికుమార్, 6వ వార్డు అధ్యక్షుడిగా ఏనుగు అయ్యప్ప రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గొరిగె రవీందర్ కురుమ, 7వ వార్డు అధ్యక్షుడిగా రొక్కం ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోపిడి వెంకటరమణారెడ్డి, 8వ వార్డు అధ్యక్షుడిగా కందాడ నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మద్ది రమేశ్ యాదవ్ 9వ వార్డు అధ్యక్షుడిగా వట్నాల ధనుంజయ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్యామల సురేశ్ ఎన్నికయ్యారు.
తారామతిపేటలో..
తారామతిపేట గ్రామ శాఖ అధ్యక్షుడుగా వడ్డెపల్లి బుచ్చిబాబు గౌడ్, ఉపాధ్యక్షుడిగా చేగూరి చంద్రశేఖర్, కార్యదర్శిగా నల్లంగళ్ల శ్రీరాములు, సంయుక్త కార్యదర్శిగా బండారి విక్రం, కోశాధికారిగా మూల రమేశ్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా నల్లంగళ్ల సునిత, చేగూరి కృష్ణ, కర్రె వెంకటేశ్, మూల రాజేశ్, బొగురంపేట భూపాల్‌రెడ్డి, శంకర్ ఎన్నికయ్యారు.
యాచారం మండలంలో..
యాచారం, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష ఆధ్వర్యంలో ఆదివారం మంథన్‌గౌరెల్లి, నందివనపర్తి, నల్లవెల్లి నూతన కమిటీలను ఎన్నుకున్నారు. మంథన్‌గౌరెల్లి నూతన అధ్యక్షుడిగా బిక్కు, ఉపాధ్యక్షులుగా శివర్ల, సోమేశ్, కార్యదర్శులుగా పఠాన్, హనీ, సంయుక్త కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా శివ, కార్యవర్గ సభ్యులుగా నర్సింహ, పద్మ, సాయికుమార్, మహేందర్, బిళ్ల, అనితను ఎన్నుకున్నారు. నందివనపర్తి గ్రామ నూతన అధ్యక్షుడిగా సుధాకర్, ఉపాధ్యక్షుడిగా బాల్‌రాజ్, కార్యదర్శిగా గౌరిశంకర్, సంయుక్త కార్యదర్శిగా రాందాస్, కోశాధికారిగా శ్రీనివాస్ నాయక్, సోషల్‌మీడియా కన్వీనర్‌గా లక్ష్మణ్, అమరేందర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. నల్లవెల్లి గ్రామ నూతన అధ్యక్షుడిగా రవిగౌడ్, యూత్ అధ్యక్షుడిగా సుధాకర్, కార్యదర్శిగా భిక్షపతి, సంయుక్త కార్యదర్శిగా శ్రీను, కోశాధికారిగా శంకర్, కార్యవర్గ సభ్యులుగా ధనలక్ష్మి, నరేశ్, కవిత, రాజునాయక్, శివరెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉదయశ్రీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు శేఖర్‌రెడ్డి, జోగిరెడ్డి, శ్రీనివాస్‌చారి పాల్గొన్నారు.
ఆగపల్లి గ్రామాధ్యక్షుడిగా శ్రీరాములు
మంచాల, సెప్టెంబర్ 5 : మండలంలోని టీఆర్ఎస్ ఆగపల్లి గ్రామశాఖ కార్యకర్తల సమావేశం ఆదివారం సర్పంచ్ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి పార్టీ మండలాధ్యక్షడు రమేశ్ హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా పూజారి శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి ఎర్రేశ్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఎండీ ఆజీబాయ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విజయ్, రఫీక్, శ్రీశైలం, లక్ష్మణ్, శేఖర్ పాల్గొన్నారు. చిత్తాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడిగా పిట్టెల పెద్దులు రాజు, ప్రధాన కార్యదర్శిగా ఏర్పుల శ్రీనివాస్, చీదేడు గ్రామశాఖ అధ్యక్షుడిగా పంతం వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, సర్పంచ్ నాగరాజు గౌడ్, ఎంపీటీసీ సుకన్య, కుకుడాల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు చంద్రయ్య పాల్గొన్నారు.
గట్టుఇప్పలపల్లి గ్రామ కమిటీ ఎన్నిక
తలకొండపల్లి, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ గట్టుఇప్పలపల్లి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా లింగం, కార్యదర్శిగా రమేశ్, ప్రవీణ్, సోషల్‌మీడియా కన్వీనర్లుగా శివ, మల్లేశ్, బీసీ సెల్ ప్రెసిడెంట్‌గా రవీందర్, ఉపాధ్యక్షుడిగా విజయేందర్, ప్రధాన కార్యదర్శిగా సత్యం, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నర్సింహ, మైనార్టీ అధ్యక్షుడిగా సాదిక్, కార్మిక విభాగం అధ్యక్షుడిగా అనంతరాములు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా విజయలక్ష్మి, యువజన విభాగం అధ్యక్షుడిగా సాయిబాబ, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా రంజిత్‌తో పాటు పలువురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు వజ్రలింగం, వెంకటయ్య, కృష్ణయ్య, శరత్‌చంద్రశర్మ పాల్గొన్నారు.