ఓయూలో ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్ జయంతి

ఉస్మానియా యూనివర్సిటీ : గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే పాపన్నకు నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు.
పాపన్న జనరంజకంగా పాలించాడని గుర్తు చేశారు. సాధారణ గౌడ్ కుటుంబం నుంచి వచ్చి, రాజ్యాన్ని స్థాపించడం గొప్ప విషయమన్నారు. ఆయన రాజ్యంలో అసలు పన్నులు ఉండేవి కావని, సామాజిక న్యాయం పాటిస్తూ ఎంతో గొప్పగా పాలించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, జేఏసీ నాయకులు బండారి వీరబాబు, మంద సురేశ్, క్రాంతి, కృష్ణ, నవీన్, భాస్కర్‌యాదవ్, దశరథ్, జిల్లా నాగయ్య, జంగయ్య, కాటం శివ, మిథున్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

