ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నందిపేట-2ఎంపీటీసీ అరుణ
నందిపేట, జనవరి 30: టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసా గుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట ఎంపీటీసీ-2 అరుణ చవాన్ బజరంగ్ (బీజే పీ) ఆదివారం ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నందిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించిన 24 గంటల్లో పలువురు నాయకులు ఆ పార్టీని వీడడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై టీఆర్ఎస్లో చేరినట్లు ఎంపీటీసీ ఆరుణ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్య క్రమంలో నందిపేట జడ్పీటీసీ ముత్యం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, ఐలాపూర్ విండో చైర్మన్ సుదర్శన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సిలిండర్ లింగం, సీనియర్ నాయకులు ఎర్ర ముత్యం, మురళి, ఉల్లి సుధాకర్‌గౌడ్, శివ, సాయన్న తదితరులు పాల్గొన్నారు.