రాత్రిపూట కరెంటు కోసం పొలాల వద్ద జాగారం.. నిత్యం విద్యుత్ ప్రమాదాలు.. విచ్చలవిడి విద్యుత్ కోతలతో పంటలు ఎండి అన్నదాతల బలవన్మరణాలు.. వీటన్నిటికీ చెక్‌పెడుతూ తెలంగాణ ప్రభుత్వం అందరి జీవితాల్లో వెలుగులు నింపింది. జనవరి 1, 2018 నుంచి సాగుకు ఉచిత, నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరాను ప్రారంభించింది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కోతల్లేకుండా అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టిన సీఎం కేసీఆర్.. నాలుగున్నరేండ్లుగా వ్యవసాయానికి నిరాటంకంగా కరెంట్ ఇస్తున్నారు.
నిజామాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : దశాబ్దాల తరబడి కరెంట్ కోతలతో తెలంగాణ ప్రాంతం అంధకారమైంది. ఎండిన పంట పొలాల సాక్షిగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డా రు. అర్ధరాత్రి కరెంట్‌తో ప్రమాదాలు కోకొల్లలు గా జరిగేవి. చీకట్లో పొలాల్లో పాముకాటుకు గాల్లో కలిసిపోయిన గడ్డు రోజులు. ఆ ప్రాణాల కు అడ్డుకట్టపడిన పర్వదినం.. రైతుల జీవితాల్లో వెలుగు నింపిన మరిచిపోలేని రోజు జనవరి 1, 2018. తెలంగాణ రైతాంగానికి ఉచిత, నాణ్యమైన 24గంటల కరెంట్ పల్లకీని మోసుకొచ్చిన పర్వదినం.
రైతుల చిరకాల స్వప్నం, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్‌ను సాకారం చేసిన పండుగ రోజు. సాగుకు ఉచిత కరెంట్‌ను నిరంతరాయంగా కోతల్లేకుండా అందిస్తూ దేశచరిత్రలో తెలంగాణ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ప్రస్తుతం భారతదేశంలో కరెంటు కోతలతో అనేక రాష్ర్టాలు సతమతమవుతుంటే తెలంగాణలో మాత్రం వ్యవసాయం, గృహ అవసరాలు, పరిశ్రమలన్నింటికీ నిరంతరాయంగా విద్యుత్ అందుతుండడం చారిత్రాత్మకం. తెలంగాణ ఏర్పాటు సమయానికి చీకట్లు అలుముకున్న రాష్ట్రంలో తన పరిపాలనా దక్షతతో ఒకటిన్నర సంవత్సర కాలంలోనే సీఎం కేసీఆర్ నిరంతర వెలుగులు ప్రసాదించారు. గడిచిన నాలుగున్నరేండ్లుగా సాగుకు నిరాటంకంగా కరెంట్ అందిస్తూ వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ప్రస్తుతం కాం గ్రెస్, శివసేన సంకీర్ణ ప్రభుత్వం రాజ్యమేలుతోం ది. అంతకు పూర్వం ఈ ప్రాంతాన్ని బీజేపీ ఏలింది. ఏలుబడిలో ఏ పార్టీ ఉన్నా, ఎవరు గద్దెనెక్కినా అక్కడి రైతుల దీనావస్థలు మాత్రం అలాగే ఉన్నాయి. మహారాష్ట్రలో వ్యవసా య రంగం కుదేలైంది. సమైక్య పాలనలో తెలంగాణలో కనిపించిన దుర్భర పరిస్థితులకు అద్దం పట్టేలా నేడు మరాఠా భూములు గోచరిస్తున్నా యి. వానకాలం పంటలు తప్ప ధైర్యంగా యా సంగిలో సాగు చేసే పరిస్థితి మరాఠా రైతులకు లేకుండా పోయింది.
చెరువులు వట్టి పోతున్నా యి. కాలువలు ఎండిపోయాయి. ప్రాజెక్టులు మరుగున పడ్డాయి. కరెంట్ సరఫరా అంతంత మాత్రమే. ఎరువులు, విత్తనాలు చేతికి అందడ మే గగనం. ఇన్ని అపశకునాల మధ్య వ్యవసా య రంగం ఘోరమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. వానకాలంలో మొగులు వైపు చూడడం తప్ప మరాఠా రైతులు చేసేదేమి లేదు. కాలమేదైనా మహారాష్ట్రలో వ్యవసాయానికి అందే విద్యుత్ సరఫరా ఆరు గంటలే. యాసంగిలోనైతే కరెంట్ సరఫరా కాల పరిమితి మరింతగా తగ్గుతున్నది. సాగుకు సరఫరా చేసే కరెంట్‌కు ఏడాదికి ఏక మొత్తంలో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. లేదంటే పవర్ కనెక్షన్ కట్ చేయడం ఇక్కడ పరిపాటి. సాగులో లాభాలు లేక కరెంట్ బిల్లులు చెల్లించలేక చాలా మంది రైతులకు వ్యవసాయ కనెక్షన్లు కట్ చేయబడినవే కనిపిస్తుండడం విడ్డూరం.
ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. పేరుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా అయినప్పటికీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పంటలను కాపాడుకునేందు కు రైతులు పొలాల వద్దనే నిరీక్షించాల్సి వచ్చేది. అధిక ఒత్తిడితో పటాకుల్లా పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లతో ఆర్థికంగా రైతన్నలు అవస్థలు పడ్డారు. బోరుబావుల్లో సమృద్ధిగా నీరున్నా పంటలకు అందక రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు.
రైతుల కరెంట్ కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా ఇప్పుడు నాలుగున్నరేండ్లుగా సవ్యంగా అందుతున్నది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై అదనపు భా రం పడి మోటర్లు కాలిపోయేటివి. మోటరు కాలిపోతే వాటిని మరమ్మతులు చేయించాలంటే సగటున ఒక్కో రైతుకు రూ.2వేల వరకు భారం అ య్యేది. చేసేది లేక అప్పు తీసుకువచ్చి రిపేర్లు బా గుచేయించేది. ఇప్పుడలాంటి ఘటనలే లేకుం డాపోయాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7లక్షల 73 వేల విద్యుత్ కనెక్షన్లలో 1,75,765 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3లక్షల 74వేల 46 విద్యుత్ కనెక్షన్లలో 95,901 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2లక్షల 71వేల 666 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్ అందుతున్నది.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాం తానికి 6గంటల కరెంట్ అది కూడా 2,3 లేదా4 విడుతలుగా వచ్చేది. ఆ కరెంట్‌తో పంటలు సరి గా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరిగోస పడేది. అర్ధరాత్రి 12గంటల తర్వాత వచ్చే త్రీఫేజ్ కరెంట్ కోసం పొలాల వద్ద పడిగాపులు కాసేవారు. ఒక్కసారిగా మోటర్లు స్టార్టవ్వడంతో ఎగిరిపోయిన ప్యూజులను మార్చే క్రమం లో ప్రాణాలు కోల్పోయిన రైతులెందరో. పల్లెటూర్లలో పండుగలు, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు పగటి పూటా అర్ధగంట కరెంట్ కోసం ఆపసోపాలు పడిన నేపథ్యం ఇప్పటికీ విద్యుత్ ఉద్యోగులు, ప్రజల మనసుల్లో స్పష్టంగా ఉంది. గృహ, వాణిజ్య వినియోగదారులకు పట్టణ, నగ ర ప్రాంతాల్లో 4-8 గంటలు, గ్రామాల్లోనైతే 12 గంటల వరకు ఏకబిగిన కరెంట్ కోతలుండేవి. పవర్ హాలిడే కొనసాగిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం మొత్తమ్మీద తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచితవిద్యుత్ అందించే స్థాయికి ఎదగడం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం,విద్యుత్ సంస్థలు సాధించిన అపూర్వ విజయమే. సీఎం కేసీఆర్ సారథ్యంలో జనరేష న్, సరఫరా, పంపిణీ రంగాలు రెండింతలుపైగా అభివృద్ధి చేసుకోవడంతోనే సాధ్యమైంది. ప్రధానంగా చిన్న, మధ్య తరహా ఎత్తిపోతలపైనే ఆధారపడిన తెలంగాణ వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను అందించడాన్ని పాలసీగా నిర్దేశించుకున్న సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం.
నిజామాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : దశాబ్దాల తరబడి కరెంట్ కోతలతో తెలంగాణ ప్రాంతం అంధకారమైంది. ఎండిన పంట పొలాల సాక్షిగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డా రు. అర్ధరాత్రి కరెంట్‌తో ప్రమాదాలు కోకొల్లలు గా జరిగేవి. చీకట్లో పొలాల్లో పాముకాటుకు గాల్లో కలిసిపోయిన గడ్డు రోజులు. ఆ ప్రాణాల కు అడ్డుకట్టపడిన పర్వదినం.. రైతుల జీవితాల్లో వెలుగు నింపిన మరిచిపోలేని రోజు జనవరి 1, 2018. తెలంగాణ రైతాంగానికి ఉచిత, నాణ్యమైన 24గంటల కరెంట్ పల్లకీని మోసుకొచ్చిన పర్వదినం. రైతుల చిరకాల స్వప్నం, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్‌ను సాకారం చేసిన పండుగ రోజు. సాగుకు ఉచిత కరెంట్‌ను నిరంతరాయంగా కోతల్లేకుండా అందిస్తూ దేశచరిత్రలో తెలంగాణ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ప్రస్తుతం భారతదేశంలో కరెంటు కోతలతో అనేక రాష్ర్టాలు సతమతమవుతుంటే తెలంగాణలో మాత్రం వ్యవసాయం, గృహ అవసరాలు, పరిశ్రమలన్నింటికీ నిరంతరాయంగా విద్యుత్ అందుతుండడం చారిత్రాత్మకం. తెలంగాణ ఏర్పాటు సమయానికి చీకట్లు అలుముకున్న రాష్ట్రంలో తన పరిపాలనా దక్షతతో ఒకటిన్నర సంవత్సర కాలంలోనే సీఎం కేసీఆర్ నిరంతర వెలుగులు ప్రసాదించారు. గడిచిన నాలుగున్నరేండ్లుగా సాగుకు నిరాటంకంగా కరెంట్ అందిస్తూ వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ప్రస్తుతం కాం గ్రెస్, శివసేన సంకీర్ణ ప్రభుత్వం రాజ్యమేలుతోం ది. అంతకు పూర్వం ఈ ప్రాంతాన్ని బీజేపీ ఏలింది. ఏలుబడిలో ఏ పార్టీ ఉన్నా, ఎవరు గద్దెనెక్కినా అక్కడి రైతుల దీనావస్థలు మాత్రం అలాగే ఉన్నాయి. మహారాష్ట్రలో వ్యవసా య రంగం కుదేలైంది. సమైక్య పాలనలో తెలంగాణలో కనిపించిన దుర్భర పరిస్థితులకు అద్దం పట్టేలా నేడు మరాఠా భూములు గోచరిస్తున్నా యి. వానకాలం పంటలు తప్ప ధైర్యంగా యా సంగిలో సాగు చేసే పరిస్థితి మరాఠా రైతులకు లేకుండా పోయింది. చెరువులు వట్టి పోతున్నా యి. కాలువలు ఎండిపోయాయి. ప్రాజెక్టులు మరుగున పడ్డాయి.
కరెంట్ సరఫరా అంతంత మాత్రమే. ఎరువులు, విత్తనాలు చేతికి అందడ మే గగనం. ఇన్ని అపశకునాల మధ్య వ్యవసా య రంగం ఘోరమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. వానకాలంలో మొగులు వైపు చూడడం తప్ప మరాఠా రైతులు చేసేదేమి లేదు. కాలమేదైనా మహారాష్ట్రలో వ్యవసాయానికి అందే విద్యుత్ సరఫరా ఆరు గంటలే. యాసంగిలోనైతే కరెంట్ సరఫరా కాల పరిమితి మరింతగా తగ్గుతున్నది. సాగుకు సరఫరా చేసే కరెంట్‌కు ఏడాదికి ఏక మొత్తంలో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. లేదంటే పవర్ కనెక్షన్ కట్ చేయడం ఇక్కడ పరిపాటి. సాగులో లాభాలు లేక కరెంట్ బిల్లులు చెల్లించలేక చాలా మంది రైతులకు వ్యవసాయ కనెక్షన్లు కట్ చేయబడినవే కనిపిస్తుండడం విడ్డూరం.
ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. పేరుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా అయినప్పటికీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పంటలను కాపాడుకునేందు కు రైతులు పొలాల వద్దనే నిరీక్షించాల్సి వచ్చేది. అధిక ఒత్తిడితో పటాకుల్లా పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లతో ఆర్థికంగా రైతన్నలు అవస్థలు పడ్డారు. బోరుబావుల్లో సమృద్ధిగా నీరున్నా పంటలకు అందక రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు. రైతుల కరెంట్ కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా ఇప్పుడు నాలుగున్నరేండ్లుగా సవ్యంగా అందుతున్నది.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై అదనపు భా రం పడి మోటర్లు కాలిపోయేటివి. మోటరు కాలిపోతే వాటిని మరమ్మతులు చేయించాలంటే సగటున ఒక్కో రైతుకు రూ.2వేల వరకు భారం అ య్యేది. చేసేది లేక అప్పు తీసుకువచ్చి రిపేర్లు బా గుచేయించేది. ఇప్పుడలాంటి ఘటనలే లేకుం డాపోయాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7లక్షల 73 వేల విద్యుత్ కనెక్షన్లలో 1,75,765 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3లక్షల 74వేల 46 విద్యుత్ కనెక్షన్లలో 95,901 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2లక్షల 71వేల 666 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్ అందుతున్నది.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాం తానికి 6గంటల కరెంట్ అది కూడా 2,3 లేదా4 విడుతలుగా వచ్చేది. ఆ కరెంట్‌తో పంటలు సరి గా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరిగోస పడేది. అర్ధరాత్రి 12గంటల తర్వాత వచ్చే త్రీఫేజ్ కరెంట్ కోసం పొలాల వద్ద పడిగాపులు కాసేవారు.
ఒక్కసారిగా మోటర్లు స్టార్టవ్వడంతో ఎగిరిపోయిన ప్యూజులను మార్చే క్రమం లో ప్రాణాలు కోల్పోయిన రైతులెందరో. పల్లెటూర్లలో పండుగలు, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు పగటి పూటా అర్ధగంట కరెంట్ కోసం ఆపసోపాలు పడిన నేపథ్యం ఇప్పటికీ విద్యుత్ ఉద్యోగులు, ప్రజల మనసుల్లో స్పష్టంగా ఉంది.
గృహ, వాణిజ్య వినియోగదారులకు పట్టణ, నగ ర ప్రాంతాల్లో 4-8 గంటలు, గ్రామాల్లోనైతే 12 గంటల వరకు ఏకబిగిన కరెంట్ కోతలుండేవి. పవర్ హాలిడే కొనసాగిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం మొత్తమ్మీద తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచితవిద్యుత్ అందించే స్థాయికి ఎదగడం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం,విద్యుత్ సంస్థలు సాధించిన అపూర్వ విజయమే. సీఎం కేసీఆర్ సారథ్యంలో జనరేష న్, సరఫరా, పంపిణీ రంగాలు రెండింతలుపైగా అభివృద్ధి చేసుకోవడంతోనే సాధ్యమైంది. ప్రధానంగా చిన్న, మధ్య తరహా ఎత్తిపోతలపైనే ఆధారపడిన తెలంగాణ వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను అందించడాన్ని పాలసీగా నిర్దేశించుకున్న సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం.
అప్పట్ల ఎవుసానికి రాత్రిపూటనే కరంటు ఉంటుండె. పొలానికి నీళ్లు పారిచ్చేందుకుపొయ్యి నా మొగుడు కరంటు షాక్ కొట్టి స్టార్టర్ డబ్బా దగ్గర్నే కుప్పకూలిండు. రాత్రి నీళ్లు పారిచ్చేందుకు పోయినమనిషి పొద్దుగాళ్ల వరకు ఇంటికి రాకపోయేసరికి పొలంకాడికి పోయిసూస్తే సచ్చిపోయి ఉన్నడు. ఇప్పుడు అసొంటి పరిస్థితి లేదు. కరెంటు రందిలేకుండా వస్తున్నది. నా కొడుకు పొద్దుగాళ్ల పోయి పొలానికి నీళ్లుజూసి వస్తుండు. పొద్దుగూకంగనే మోటరు బంద్ చేసి వస్తుండు. రాత్రిపూట పొలంకాడికి పొయ్యే పనేలేదు.
-ర్యాలమడుగు బాగవ్వ, రైతు, శెట్పల్లి(లింగంపేట)
వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడంతో మోటర్ల వినియోగం తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు వేశారు. లో వొల్టేజీ సమస్య లేకపోవడంతో మోటర్లు కాలిపోవడం లేదు. గతంలో వ్యవసాయానికి తక్కువ సమయం విద్యుత్ సరఫరా ఉండేది. రాత్రిపూట విద్యుత్ సరఫరా వచ్చిన సమయంలో రైతులందరూ ఒకేసారి మోటర్లు నడపడంతో ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పెరిగిలో వొల్టేజీ సమస్య వచ్చి మోటర్లు కాలిపోయేవి. ప్రస్తుతం మోటర్లు కాలిపోవడం లేదు. విద్యుత్ కనెక్షన్ సక్రమంగా ఇవ్వని మోటర్లు మాత్రమే కాలుతున్నాయి.
– తిరుమల కిరణ్, మోటరు మెకానిక్, లింగంపేట
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పంటలకు పగటి పూట నీటిని అందిస్తున్నాం. గతంలో మాదిరి రాత్రిపూట విద్యుత్ కోసం వేచి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. రాత్రిపూట మోటర్లు నడిపించడం లేదు.
-శ్రీనివాస్ యాదవ్, రైతు, శెట్పల్లి(లింగంపేట)