ఏర్గట్ల, జనవరి 27 : వసుంధర విజ్ఞాన వికాస మండలి పెద్దపల్లి వారు నిర్వహించిన ‘కరోనా కాలంలో చదువు’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని తెలుగుపండితుడు ప్రవీణ్శర్మ తెలిపారు. ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా 175 మంది పాల్గొనగా పదో తరగతి చదువుతున్న ఆది వైష్ణవి రాసిన కవితకు ప్రథమ బహుమతి వచ్చినట్లు పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థినులు రవళి, రోషిణి, గ్రీష్మ, హన్సిక, వైష్ణవి, మీనాక్షికి ఉపాధ్యాయ బృందం ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించింది. కార్యక్రమంలో హెచ్ఎం రాములు, నాగప్ప, నరేందర్,స్వప్న, విజయ,తదితరులు పాల్గొన్నారు.