ఆర్మూర్/వేల్పూర్/నిజామాబాద్ సిటీ/కామారెడ్డి, జనవరి 27: టీఆర్ఎస్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులుగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ముజీబుద్దీన్‌కు గురువారం అభినందనలు వెల్లువెత్తాయి. జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుష్పగుచ్ఛం, ఖడ్గాన్ని అందజేసి భారీ గజమాలతో సత్కరించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జీవన్‌రెడ్డికి స్వీటు తినిపించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ అతడికి శుభాకాంక్షలు తెలిపారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, ఆలూర్ సొసైటీ చైర్మన్ కల్లెం భోజారెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మచ్చర్ల సిర్పూరం భోజారెడ్డి, దేగాం ఎంపీటీసీ ఉప్పునూతుల అనూషా శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు. ప్రభుత్వ విప్ గోవర్ధన్‌తో పాటు ముజీబుద్దీన్ స్పీకర్ నివాసానికి వెళ్లగా.. స్పీకర్ టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి వేములను కలువగా ముజీబుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ముజీబుద్దీన్‌కు ఈ సందర్భంగా స్పీకర్, మంత్రి సూచించారు. జిల్లా సారథ్య బాధ్యతలను అప్పగించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జీవన్‌రెడ్డి, ముజీబుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.