పిట్లం/ ఎల్లారెడ్డి/ నాగిరెడ్డిపేట్/ లింగంపేట్/ రామారెడ్డి/ నస్రుల్లాబాద్/బాన్సువాడ/తాడ్వాయి/నిజాంసాగర్, సెప్టెంబర్ 12 : జిల్లాలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక సందడి కొనసాగుతున్నది. ఆదివారం సైతం నూతన కమిటీలను ఎన్నుకొని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నియామకపత్రాలను అందజేశారు. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలో ఎంపీపీ కవితా విజయ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముకుంద్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గోపాల్, కార్యదర్శిగా బొండ్ల కృష్ణను ఎన్నుకున్నారు. వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బ్రాహ్మణ్‌పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జిన్న మారుతి, ఉపాధ్యక్షుడిగా చింతసాయిలు, కుర్తి గ్రామంలో సర్పంచ్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మైశయ్య, కార్యదర్శిగా కేశయ్య, ప్రధానకార్యదర్శిగా నాగం మహిపాల్, కోశాధికారిగా సలీంపటేల్ను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్ ఆధ్వర్యంలో కిష్టాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తుకారాం, ఉపాధ్యక్షుడిగా అవారిసాయిలు, కార్యదర్శిగా తుపాకుల సాయిలు, సంయుక్త కార్యదర్శిగా బాలరాజ్, కోశాధికారిగా కడావత్ రమేశ్‌ను ఎన్నుకున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని ఏడో వార్డు టీఆర్ఎస్ కమిటీని మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. రేపల్లెవాడ, లక్ష్మాపూర్ గ్రామాల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి తెలిపారు. లక్ష్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రవీందర్, ఉపాధ్యక్షుడిగా ఇస్మాయిల్, ప్రధానకార్యదర్శిగా బండ్ల కాశీరాం, రేపల్లెవాడ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బెస్త ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కమ్మరి రాములు ఎన్నికయ్యారు.
నాగిరెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య తెలిపారు. నాగిరెడ్డిపేట్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జలగరి రవీందర్, ప్రధానకార్యదర్శిగా బోయిని మల్లేశం, బెజుగం చెరువుతండా అధ్యక్షుడిగా దరావత్రాము, ప్రధానకార్యదర్శిగా మలావత్ పీక్లానాయక్, మెల్లకుంటతండా అధ్యక్షుడిగా రమావత్ బాల్యా, ప్రధానకార్యదర్శిగా కోర్య గోవింద్, బొల్లారం అధ్యక్షుడిగా సార నాగార్జున్‌గౌడ్, ప్రధానకార్యదర్శిగా నాయకోటి రాజు, పల్లె బొగడతండా అధ్యక్షుడిగా దనావత్ దోప్లా, ప్రధానకార్యదర్శిగా దనావత్ దేవ్లా, రాఘవపల్లి అధ్యక్షుడిగా ఎర్రోళ్ల రామాగౌడ్, ప్రధానకార్యదర్శిగా నార్ల మల్లేశ్, మాల్తుమ్మెద అధ్యక్షుడిగా జుంజుర్ సుధాకర్, ప్రధానకార్యదర్శిగా ఈటెల ఏసును ఎన్నుకున్నారు.
లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు దివిటి రమేశ్ తెలిపారు. సజ్జన్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మల్కన్నగారి సిద్ధిరాములు, ఉపాధ్యక్షుడిగా ఎల్లన్నగారి సాయిలు, ప్రధాన కార్యదర్శిగా మాసన్నగారి సాయిలు, సహాయ కార్యదర్శిగా పెద్దోళ్ల సాయిలు, కోశాధికారిగా గంగారాంను ఎన్నుకున్నట్లు తెలిపారు. జగదంబ తండా అధ్యక్షుడిగా దేగావత్ దేవుజా, ఉపాధ్యక్షుడిగా పీర్యా, ప్రధాన కార్యదర్శిగా భీమ్లా, యూత్ విభాగం అధ్యక్షుడిగా దేవేందర్, ఉపాధ్యక్షుడిగా రమేశ్, ప్రధాన కార్యదర్శిగా రవిని ఎన్నుకున్నారు. కన్నాపూర్ అధ్యక్షుడిగా నిజ్జని కాశీరాం, ఉపాధ్యక్షుడిగా నిజ్జని విఠల్, ప్రధానకార్యదర్శిగా ప్రభుదాస్, యూత్ విభాగం అధ్యక్షుడిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా రాజలింగం, ప్రధానకార్యదర్శిగా దాసు, శెట్పల్లిసంగారెడ్డి అధ్యక్షుడిగా కిశోర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సాయిబాబా, ప్రధానకార్యదర్శిగా కమ్మరి భూపతి, సహాయ కార్యదర్శిగా సాయిలు, కోశాధికారిగా చిన్న సిద్ధిరాములు, యూత్ విభాగం అధ్యక్షుడిగా సాకలి రమేశ్, ఉపాధ్యక్షుడిగా జీవన్, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, సహాయ కార్యదర్శిగా భూమేశ్, కోశాధికారిగా సంతోష్‌ను ఎన్నుకున్నారు. ఎక్కపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నీల శంకర్, ఉపాధ్యక్షుడిగా తొర్రి పర్వయ్య, ప్రధానకార్యదర్శిగా నీల రామకిష్టయ్య, సహాయ కార్యదర్శిగా రాములును ఎన్నుకున్నారు. మాలపాటి అధ్యక్షుడిగా మినుముల అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కొమ్ముల సాయిలు, ప్రధానకార్యదర్శిగా కంపె మల్లేశ్, సహాయ కార్యదర్శిగా దుర్గయ్య, కోశాధికారిగా మినుముల సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు.
రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి ఆధ్వర్యంలో, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెనుకుల పుండరీకం, ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్, ప్రధానకార్యదర్శిగా రాంరెడ్డి, రైతు కమిటీ అధ్యక్షుడిగా నారాయణరెడ్డిని ఎన్నుకున్నారు.
నస్రుల్లాబాద్ గ్రామ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా గుండావర్ బాలకృష్ణ, కటికె బాలాజీ, మిర్జాపూర్‌లో నర్సాగౌడ్, పురం సాయిలు, సంగెంలో సలావత్ సురేందర్, బ్యాగరి బాలయ్య, మైలారంలో తోటావర్ సాయిరాం యాదవ్, ధూళి గంగారాం, నాచుపల్లిలో కాజా వెంకటేశ్వరరావు(అధ్యక్షుడు), దుర్కిలో సూరంపల్లి రాకేశ్, గరుగల్ల సాయిలు, కంశెట్పల్లిలో రమేశ్, కుద్దూస్, బొమ్మన్‌దేవ్‌పల్లిలో మహేశ్, ఎండీ ఉమర్, బొప్పాస్‌పల్లిలో దశరథ్, జాదవ్శంకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్ తెలిపారు.
బాన్సువాడ మండలం కొల్లూర్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా బర్ల అశోక్, కొత్తబాది అధ్యక్షుడిగా జె.సాయిరెడ్డి, బుడ్మి అధ్యక్షుడిగా జిన్న వెంకట్రాములును ఎన్నుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని 11వ వార్డు అధ్యక్షుడిగా గులెపల్లి శంకర్, మహిళా అధ్యక్షురాలిగా పోల్కం విజయలక్ష్మిని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పాత బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
తాడ్వాయి మండల పరిధిలోని ఎండ్రియాల్, కృష్ణాజివాడి, బ్రహ్మాజివాడి, కన్కల్, దేవాయిపల్లి, సంగోజివాడిలో టీఆర్ఎస్ గ్రామకమిటీలను ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు సాయిరెడ్డి తెలిపారు. గ్రామ ఇన్చార్జీల సమక్షంలో నూతన కమిటీలను ఎన్నుకున్నామని తెలిపారు.
నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ పర్యటించి గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. మాగి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చీకోటి జగన్, ఉపాధ్యక్షుడిగా మెంగారాం గంగారం, కార్యదర్శిగా రాజం సాయిలుతోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మగ్ధుంపూర్ అధ్యక్షుడిగా తెలుగు రాజు, ఉపాధ్యక్షుడిగా శీలం సాయిలు, గాలీపూర్ అధ్యక్షుడిగా కాలూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా తుక్కారం, ధూప్సింగ్తండా అధ్యక్షుడిగా సూర్యనాయక్, ఉపాధ్యక్షుడిగా ధరావత్ గంగారాం, తెల్గాపూర్ అధ్యక్షుడిగా దుర్గయ్య, ఉపాధ్యక్షుడిగా రవీందర్, బూర్గుల్ అధ్యక్షుడిగా పెద్దింటి దస్తయ్య, ఉపాధ్యక్షుడిగా గొల్ల ఆంజనేయులు, గున్కుల్ అధ్యక్షుడిగా దండు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా కాయిదాపురం సుధాకర్‌రెడ్డి, మహ్మద్‌నగర్ అధ్యక్షుడిగా చింతకింది కాశయ్య, ఉపాధ్యక్షుడిగా మహేందర్, నర్వ అధ్యక్షుడిగా రాజేశ్వర్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా గోర్గంటి రాములు, తున్కిపల్లి అధ్యక్షుడిగా సింగంశెట్టి రవి, ఉపాధ్యక్షుడిగా బొల్లి సాయాగౌడ్, కోమలంచ అధ్యక్షుడిగా పుట్టం బాల్‌రాంరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మంత్రసాని కిష్టారెడ్డిని ఎన్నుకున్నారు.