అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారు
ఎమ్మెల్యే బాజిరెడ్డి
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 31 : సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. అనారోగ్యంబారిన పడిన పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసహాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోని తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని, ఈనెల 2వ తేదీన ప్రతిగ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నిజామాబాద్ రూరల్ ఎంపీపీ బానోత్ అనూష, జడ్పీటీసీ బొల్లెంక సుమలత, తహసీల్దార్ ప్రశాంత్‌కుమార్, గిర్దావర్ భూపతిప్రభు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కె సంతోష్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి, 1వ డివిజన్ కార్పొరేటర్ కోర్వ లలిత, సర్పంచులు లక్ష్మణ్‌రావు, నగేశ్, లావణ్య, ఎంపీటీసీ అంకల గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, ప్రేమ్దాస్నాయక్, గోపా ల్, అక్బర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
అమృతాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..
డిచ్పల్లి, ఆగస్టు 31: మండలంలోని అమృతాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అమృతాపూర్ వీడీసీ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏ అవసరం వచ్చినా తనను కలువాలని గ్రామస్తులకు సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, సీనియర్ నాయకుడు దాసరి లక్ష్మీనర్సయ్య, సర్పంచులు జగదీశ్, యూసుఫ్, తిరుపతి, అమృతాపూర్ ఎంపీటీసీ సభ్యుడు దండుగుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సాయినాథ్, అమృతాపూర్ వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
సిరికొండ, ఆగస్టు 31 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వరంలా మారిందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో 87 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ పాఠశాలనుప్రారంభించారు. ధర్పల్లి జడ్పీటీసీ జగన్, ఎంపీపీ మలావత్ సంగీతారాజేందర్, జడ్పీటీసీ మలావత్ మాన్సింగ్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, తహసీల్దార్ అనిల్‌కుమార్, సర్పంచు లు ఎన్నం రాజిరెడ్డి, పోడెల్ల రమేశ్, ఈజాప లక్ష్మీనర్సయ్య, కన్క శ్రీనివాస్, పల్లె బాలమణి, మల్లేశ్, నర్సారెడ్డి, గంగదాస్, ఎంపీటీసీలు అల్లిపురం రాజవ్వ, చిన్న గంగు, గాండ్ల గోవర్ధన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గ్గొన్నారు.