నిర్మల్ టౌన్, ఏప్రిల్ 8 : నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పం చ్,ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాశుక్రవారం విడుదల చేసినట్లు డీపీవో వెంకటేశ్వర్రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 11 సర్పంచ్, 217 వార్డు సభ్యులు, మూడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల డ్రాప్టు నోటిఫికేషన్ ప్రకటించి, ఆయా పంచాయతీల్లో ప్రదర్శించినట్లు వివరించారు. ఈనెల 21 వరకు సమగ్ర ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, గ్రామస్తులు ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.