నిర్మల్ అర్బన్, ఏప్రిల్8 : రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అ న్నారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర వైఖరికి నిరసనగా రై తుల పక్షాన తన నివాసంపై మంత్రి శుక్రవారం నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సం దర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణికి నిరసనగా ఈ నల్ల జెండాను ఎగుర వేశామన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నల్ల జెండాలను ఎగురవేసి రైతులకు సంఘీభావం తెలుపాలని కోరారు. తె లంగాణ రైతన్నలు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, తెలంగాణపై కేంద్రం వివక్ష విడనాడాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల తరఫున కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఊరూరా ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేయాలని, గ్రామ కూడళ్లలో కేంద్ర దిష్టిబొమ్మను దహనం చేసి ఢిల్లీ వరకు ఈ నిరసన సెగ లు తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీపై రైతులతో పాటు సామా న్య ప్రజలు సైతం తిరుగుబాటు చేస్తున్నారన్నారు. నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో లక్ష ఇండ్లపై రైతులు నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ శివాజీ చౌక్, ఈద్ గాం చౌరస్తా, అంబేద్కర్ ఆడిటోరియం, జయశంకర్ చౌక్, పాత బస్టాండ్ మీదుగా మంత్రి క్యాంప్ కార్యాలయం వరకు కొనసాగింది. వెయ్యి మోటర్ సైకిళ్లతో ఈ ర్యాలీ సాగింది. దీనికి రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యా రు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, గండ్రత్ రమణ, అయ్యన్నగారి రా జేందర్, ఎస్పీ రాజు, పూదరి రాజేశ్వర్, నేరేళ్ల వేణు, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, నాయకులు మల్లికార్జున్ రెడ్డి, ముత్యం రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, ముడుసు సత్యనారాయణ, కోటగిరి అశోక్, మే డారం ప్రదీప్, అప్పాల వంశీ, ఆకోజి కిషన్, లక్ష్మీనారాయణ, గొనుగోపుల నర్సయ్య పాల్గొన్నారు.