గ్రామంలో మౌలిక వసతుల కల్పన
వైకుంఠధామం, డంపింగ్ యార్డు ఏర్పాటు
నిర్మాణంలో నూతనగ్రామ పంచాయతీ భవనం
శంకర్పల్లి, డిసెంబర్ 3: సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో శేరిగూడ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. మండలంలో శేరిగూడ నూతన పంచాయతీగా ఏర్పా టై మూడేండ్లు అవుతున్నది. గతంలో ఈ గ్రామం కొండకల్ కు అనుబంధంగా ఉండేది. సీఎం కేసీఆర్ 500 మంది జనా భా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించారు. శేరిగూడకు సత్యనారాయణ సర్పంచ్‌గా ఎన్ని కై మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.
రూ.12.75 లక్షలతో వైకుంఠధామం ఏర్పాటు
గ్రామంలో రూ.12.75 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించా రు. అందులో స్నానపు గదులు, విశ్రాంతి గదిని నిర్మించారు. వైకుంఠధామం వరకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. అలాగే రూ.3 లక్షలతో కాలువను ఏర్పాటు చేశారు.
రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు..
గ్రామంలో రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డును నిర్మిం చారు. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ తడి , పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు సర్పంచ్ చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రూ.2.50 లక్షలతో గ్రామంలో రచ్చబండను ఏర్పాటు చేశారు.
రూ.35 లక్షలతో నూతన పంచాయతీ భవన నిర్మాణం
గతంలో అంగన్వాడీ భవనంలో పంచాయతీ కార్యకలాపాలను నిర్వహించేవారు. నేడు అదే స్థలంలో రూ.35 లక్షలతో ఆధునిక పద్ధ్దతిలో సర్పంచ్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నారు. తాగునీటి కోసం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద రూ.6 లక్షలతో సంపు నిర్మించి ప్రజలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. రూ.2 లక్షలతో ఇంకుడు గుంతల ఏర్పాటు, రూ.3.50 లక్షలతో పలు వార్డు ల్లో బోర్లు వేయించారు. రూ. 2.50 లక్షలతో వీధి దీపాల ఏర్పా టు, రూ. 4.50 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేసి గ్రామంలోని చెత్తను ఆ ట్రాక్టర్ ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. సర్పంచ్ సత్యనారాయణ ప్రభు త్వం కేటాయిస్తున్న నిధులే కాకుండా దాతల సహకారంతోనూ సీసీ రోడ్లు, మురికి కాల్వల పనులను పూర్తి చేశారు.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దు తాం. ప్రభుత్వ పలు అభి వృద్ధి పనులను పూర్తి చేశా. గ్రామం లో హనుమాన్ ఆలయం నుంచి గ్రీన్‌ల్యాండ్ ఎస్టేట్ వరకు రూ.41 లక్షలతో సీసీ రోడ్డును, రూ.20 లక్షలతో లింక్ అండర్ డ్రైనే జీ పనులు, శేరిగూడ నుంచి కంచర్లగూడెం వరకు రూ.30 లక్షలతో బీటీ రోడ్డు పనులను పూర్తి చేశా. గ్రామంలో ఇంకా మిగిలిపోయిన పనులను దశల వారీగా పూర్తి చేస్తా. గ్రామాభివృద్ధికి స్థానికులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. -సత్యనారాయణ, గ్రామసర్పంచ్