భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
వాయినాలు, పసుపు, కుంకుమలు
అందజేసుకున్న మహిళలు
కృష్ణ, ఆగస్టు 20 : శ్రావణమాసం రెండో శుక్రవా రం పురస్కరించుకొని మండలకేంద్రంతోపాటు చే గుంట పార్వతీ పరమేశ్వరాలయం, గుడెబల్లర్లో స్వ యం భూ లక్ష్మీవేంటేశ్వరాలయంతోపాటు తదితర గ్రామాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల్లో భగవన్నామస్మరణతో మార్మోగాయి. కార్యక్రమంలో ఆలయ అర్చక బృం దం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కోలాహలంగా లోకపల్లి
నారాయణపేట రూరల్, ఆగస్టు 20 : శ్రావణమా సం రెండో శుక్రవారం వరలక్ష్మీవ్రతం సందర్భంగా లోకపల్లి లక్ష్మమ్మ ఆలయం వద్ద భక్తులతో కోలాహలంగా మారింది. వివిధ ప్రత్యేక వాహనాల్లో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్, లయన్స్ క్లబ్ గవర్నర్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కుంకుమార్చన, అభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళహారతి తీర్థప్రసాదాల వితరణ చేశారు. అన్నదానం భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శిరీష, లయన్స్ క్లబ్ కార్యద ర్శి జనార్దన్, సభ్యులు పాల్గొన్నారు.
టీటీడీ, మన గుడి ఆధ్వర్యంలో…
ఊట్కూర్, ఆగస్టు 20 : తిరుమల తిరుపతి దేవస్థానం, మన గుడి ఆధ్వర్యంలో మండలంలోని బిజ్వారంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆలయంలో నిర్వహించిన వ్రతంలో దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ సుఖలు, శుభాలు కలుగాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మండల ధర్మాచార్యులు కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, రా మాంజనేయులు, రామలింగంగౌడ్, హన్మంతు పాల్గొన్నారు.
దామరగిద్ద మండంలో…
దామరగిద్ద, ఆగస్టు 20 : మండలంలోని క్యాతన్‌పల్లి వీరభద్రేశ్వరాయలంలో శ్రావణమా సం రెండో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అ భిషేకం, పంచాతామృతం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో వివి ధ గ్రామాల భక్తులు, ఆలయ పూజారి శివకుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ మండలంలో…
మక్తల్ టౌన్, ఆగస్టు 20 : పట్టణంలోని మహిళలు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. స్థానిక సరస్వతీ శిశు మందిర్ విద్యాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్ర తం వైభవంగా చేపట్టారు. అమ్మవారికి అభిషేకం, పంచాతామృతం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు తదిత రులు పాల్గొన్నారు.
నారాయణపేట మండలంలో…
నారాయణపేట టౌన్, ఆగస్టు 20 : శ్రావ ణమాసం శుక్రవారం సందర్భంగా పట్టణ ప్రజలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మహిళలు వారి వారి ఇండ్లల్ల్లో వత్రాలు ఆచరించి ముత్తయిదువులకు తాంబూలం అందజేశారు. తమ కోరికలు సిద్ధించాలని, సకల సౌభాగ్యాలు కలుగజేయాలని అమ్మవారిని కోరుకున్నారు.