భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
నైవేద్యాలు సమర్పించిన భక్తులు
కోస్గి, ఆగస్టు 28 : మండలంలోని తోగాపూర్ పందిరి ఆంజనేయస్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి శ్రావణమాసంలో మూడో శనివారం నిర్వహించే ఉత్సవాలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, మహాకుంభాభిషేకం, మహా పూర్ణాహుతి, హారతితోపాటు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎడ్ల బండ్లను స్వామివారి ఆలయం చుట్టూ తిప్పారు.
ఘనంగా ఆది హనుమాన్ రథోత్సవం
మరికల్, ఆగస్టు 28 : మండలంలో వెలిసిన ఆది హనుమాన్, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, మహాకుంభాభిషేకం, ఆకు పూజలు చేశారు. భక్తులు పటాకులు కాలుస్తూ ఆంజనేయస్వామి నామస్మరణ చేస్తూ రథోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. అలాగే కాశీవిశ్వేశ్వరస్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు హనుమాన్వాడ రైతు సంఘం ఆధ్వర్యం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా కి ష్టంపల్లి ఆంజనేయస్వామి ఉత్సవాలను గొల్ల యాదవులు ఘనంగా నిర్వహించారు. జల్దిబిందె సేవతో స్వామివారిని ఊరేగించారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. వెంకటాపూర్లో ఆంజనేయస్వామి జల్దిబిందె సేవ కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దేవాలయంలో పూజలు
కృష్ణ, ఆగస్టు 28 : మండలంలోని గుడెబల్లూర్ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అంతకుముందు బాజాభజంత్రీలతో ఊరేగింపుగా స్వామివారి విగ్రహాలను పల్లకీలో కృష్ణానదికి తీసుకెళ్లి జలాలతో అభిషేకాలు చేసి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూ జలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కనులపండువగా జగలింగేశ్వరస్వామి ఉత్సవాలు
నారాయణపేట, ఆగస్టు 28 : జగలింగేశ్వరస్వామి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పూజారి స్వగృహం నుంచి అశ్వం, స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం వరకు ఊరేగించారు. ఊరేగింపులో మహిళలు మంగళహారతలు, బొడ్డెమ్మలు, యువకులు కోలాట విన్యాసాలు, అ డుగుల భజన, సంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు. స్వామివారికి జల, పుష్ప, పంచామృతాభిషేకం, ఫలాభిషే కం చేశారు. ఉత్సవంలో ప్రత్యేకంగా నిలిచే గొలుసు తెంపే కార్యక్రమం ఆకర్షణీయంగా నిలిచింది. కార్యక్రమంలో జా తర కన్వీనర్, మాజీ కౌన్సిలర్ సుధాకర్, పూజారులు, కు ర్వ సంఘం సభ్యులు, మహిళులు, యువకులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.
ఆలయాలను దర్శించుకున్న భక్తులు
ఊట్కూర్, ఆగస్టు 28 : శ్రావణమాసం నాలుగో శనివా రం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలను ద ర్శించుకున్నారు. మండలంలోని మొగ్దుంపూర్ హనుమాన్ ఆలయంలో హనుమంతుడికి అభిషేకం, ఆకు పూజ, అలంకరణ, మహా మంగళహారతి, ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్ర్తాలతో అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రి పలు ఆలయాల వద్ద భజనలు చేశారు.
జల్దిబిందె ఊరేగింపు
మాగనూర్, ఆగస్టు 28 : మండలకేంద్రంలోని లక్ష్మీన ర్సింహాస్వామి జల్దిబిందె కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనం గా నిర్వహించారు. స్వామివారికి కృష్ణానది జలాలతో జల, పుష్ప, పంచామృతాభిషేకం, ఫలాభిషేకం చేశారు. అనంత రం పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.