దేవరకొండ, ఏప్రిల్ 10 : దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామానికి చెందిన 60 మంది వివిధ పార్టీల నుంచి దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలస వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జాన్‌యాదవ్, వైస్ ఎంపీపీ సుభాశ్‌గౌడ్, జడ్పీటీసీ అరుణాసురేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మమ్మాకృష్ణయ్య, వైస్ చైర్మన్ రహత్‌అలీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు దేవేందర్‌నాయక్, వెంకటేశ్‌గౌడ్, కౌన్సిలర్లు రయీస్, సైదులు, జయప్రకాశ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, బాలూనాయక్ పాల్గొన్నారు.