చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు అందిస్తున్న బాలామృతం హాట్‌కేక్‌లా మారింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం బాలామృతం అందిస్తుండగా గతంలో నాణ్యతాలోపం కారణంగా వృథా అయ్యేది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా ధనం వృథా అవుతున్న నేపథ్యంలో నాణ్యతను పెంచింది. చిన్నారులు ఇష్టంగా తింటుండడంతో బాలామృతానికి డిమాండ్ పెరిగిందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం నాణ్యతను పెంచింది. పోషక విలువలు పెంచి రుచికరంగా అందిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పొడి రూపంలో ఉండే బాలామృతంతోపాటు గర్భిణులు, బాలింతలకు ఒక్క పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. గతంలో పొడి బాలామృతం రుచిగా లేకపోవడంతో పిల్లలు తినకుండా వృథా అయ్యేది. నేపథ్యంలో బాలామృతం నాణ్యతను పెంచి మరింత రుచిగా అందిస్తున్నది.
నల్లగొండ జిల్లాలోని 9 ప్రాజెక్టుల పరిధిలో 2,093 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 89,003 మంది చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ప్రతి నెలా బరువు, ఎత్తు, తదితర అరోగ్య వివరాలను నమోదు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు.. చాలా మందిలో అనారోగ్య సమస్యలను గుర్తించారు. గతేడాది 78,368 మంది చిన్నారుల్లో 21,271 మంది రక్తహీనత, పోషణలోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 9,302 మంది చిన్నారులు రక్తహీనత, 5,939 మంది పోషణలోపంతో ఉన్నట్లు తేల్చారు. వారందరికీ బాలామృతం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బాలామృతం నాణ్యత, రుచిని మార్చి ఆరునెలలుగా కొత్త ప్యాకింగ్‌తో సరఫరా చేస్తున్నది. దాంతో పిల్లలో పోషక విలువలు పెరుగడంతోపాటు వారిలో ఎదుగుదల కనిపిస్తున్నది. చిన్నారులు ఎక్కువగా ఇష్టపడడంతో బాలామృతానికి డిమాండ్ పెరిగింది.
– తూముల నిర్మల, సీడీపీఓ, నల్లగొండ